మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి సీపీ మహేశ్ భగవత్ నివాళులు అర్పించారు. తన జీవితం, గొప్ప ఆలోచనల నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని సీపీ తెలిపారు.
సుసంపన్న భారతదేశాన్ని సృష్టించడంలో బాపు ఆదర్శాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని... బాపు విధాన విషయాలపై తెలివైన అవగాహన మన దేశానికి గొప్ప ఆస్తులని కొనియాడారు. బలహీనంగా ఉన్నవారికి సేవ చేయడం పట్ల గాంధీ చాలా కరుణ కలిగి ఉండేవాడని... పాఠశాల విద్యార్థులకు సీపీ బోధించారు.