ETV Bharat / city

కరోనా బాధితులకు వైద్యులు, సిబ్బంది అండ - కరోనా వైరస్​ జాగ్రత్తలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కాగా, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా కరోనా బాధితులకు సాంత్వన చేకూర్చే బృహత్తర బాధ్యతల్లో నిమగ్నమైంది. ఇక్కడి వైద్యులు, సిబ్బంది దృఢ సంకల్పంతో కొవిడ్‌-19 బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే 19 మంది వైరస్‌ సోకిన వ్యక్తులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు పంపిన ఘనత ఇక్కడి వైద్యులది.

gandhi hospital
గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి
author img

By

Published : Apr 6, 2020, 6:48 AM IST

గాంధీ ఆసుపత్రిలో అధికారికంగా 1050 పడకలుంటే.. రోగుల తాకిడి మేరకు 2200 పడకలు ఏర్పాటు చేసి దాదాపు అన్ని రోగాలకు చికిత్స అందిస్తున్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించగా.. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందుతున్నాయి. మార్చి ఒకటో తేదీన గాంధీ ఆసుపత్రిలో మొదటి కరోనా కేసు నమోదైంది. దీన్ని వైద్యులు ఎంతో సమర్థంగా ఎదుర్కొని, బాధితుడిని సురక్షితంగా ఇంటికి పంపించారు.

అలుపెరగని రీతిలో..

రాష్ట్రంలో కరోనాకు ఈ ఆసుపత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. రోజురోజుకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య పెరుగుతున్నా.. అలుపెరగని రీతిలో సేవలందిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. బాధితుల్లో మనోస్థైర్యం నింపుతూ... బలవర్ధకమైన ఆహారం, తగిన మందులతో చికిత్స చేస్తున్నారు.

కమిటీలదే బాధ్యత..

కరోనా బాధితుల నుంచి ఆసుపత్రికి వచ్చే ఇతరులకు వైరస్‌ సోకకుండా పాలనా యంత్రాంగం జనరల్‌ ఓపీని రద్దు చేసింది. క్రమక్రమంగా అత్యవసర, గైనకాలజీ, జనరల్‌ సర్జన్‌, ఆర్ధోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ తదితర విభాగాలను, వాటిలోని రోగులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం గాంధీ నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్‌ చేసే డీ-మెడ్‌ విభాగం మాత్రమే ఉంది. మిగిలినదంతా కరోనా చికిత్సలకే కేటాయించారు. బాధితులు, అనుమానితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ వైద్యులు, సిబ్బందితో మొత్తం 16 కమిటీలను ఏర్పాటు చేశారు.

రసాయనాలు చల్లి..

ఆసుపత్రికి వచ్చే కరోనా అనుమానితులను ముందుగా ప్రత్యేక లిఫ్టు ద్వారా ఏడో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డుకు తీసుకువెళ్లి ఎక్స్‌రే తీస్తారు. అనంతరం మిగిలిన నమూనాలు పరీక్షలకు పంపిస్తారు. ఆ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు అనుమానితులను ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచి వారి బాగోగులు చూసుకోవాలి. ఈ ప్రక్రియను ఎక్కడికక్కడ ఆయా కమిటీలు పర్యవేక్షిస్తాయి. రోగులకు ఆహారం, వైద్యం, ఎవరైనా మృతి చెందితే రసాయనాలు చల్లి మృతదేహాన్ని బాధితులకు అందజేసే వరకు ఈ కమిటీలు బాధ్యత వహిస్తాయి.

రోగులకు లోటు రాకుండా...

కరోనాతో చికిత్స పొందుతున్న వారికి రోజూ ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రెండు మూడు కూరలతో భోజనం, నాలుగు గంటలకు పండ్లు, ఎండు ఫలాలు, బిస్కెట్లు, కాఫీ, టీ ఇస్తున్నారు. ఇటీవల వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై కొందరు దాడి చేయడంతో భద్రతను పెంచారు. వైద్యసేవలు అందించే భవనంలోని ప్రతి అంతస్తుకు ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు 24 గంటలూ విధుల్లో ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: విరజిమ్మిన వెలుగులు.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.