ETV Bharat / city

అట్టుడికిన 'గాంధీ'.. జూడాల ధర్నా యథాతథం - గాంధీలో జూడాల ఆందోళన

జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, బైఠాయింపులతో గాంధీ ఆస్పత్రి అట్టుడికిపోతుంది. మంత్రి ఈటలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని....ఆందోళనలు కొనసాగిస్తున్నామని జూడాలు స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు విధులకు హాజరయ్యేది లేదని భీష్మించారు.కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు జూనియర్ వైద్యుడిపై దాడి చేయడంతో మంగళవారం ప్రారంభమైన కొనసాగుతూనే ఉంది.

అట్టుడికిన 'గాంధీ'.. జూడాల  ధర్నా యథాతథం
అట్టుడికిన 'గాంధీ'.. జూడాల ధర్నా యథాతథం
author img

By

Published : Jun 11, 2020, 5:54 AM IST

Updated : Jun 11, 2020, 6:14 AM IST

అట్టుడికిన 'గాంధీ'.. జూడాల ధర్నా యథాతథం

కరోనాతో మృతి చెందిన రోగి బంధువుల దాడికి నిరసనగా...తమకు న్యాయం చేయాలంటూ జూడాలు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఓ వైద్యుడిపై దాడిని ఖండిస్తూ పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి... గాంధీ ఆస్పత్రి బయట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు జూడాల నిరసనలతో కోరనా రోగులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే...తమపై దాడికి పాల్పడటం దారుణమన్నారు. అన్ని వార్డుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఐదు డిమాండ్లు..

గాంధీలో మెుత్తం1000 మంది జూనియర్‌ డాక్టర్లు ఉండగా.... ప్రస్తుతం 300 మంది జూడాలు పూర్తి స్థాయిలో విధుల్లో కొనసాగుతున్నారు. తమపై అధిక పనిభారం ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నామని జూడాలు చెబుతున్నారు. ధర్నాకు దిగిన వైద్యులతో మంత్రి ఈటల దాదాపు 3 గంటల పాటు చర్చలు నిర్వహించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను జూడాలు మంత్రి ముందుంచారు. గాంధీలో అవసరమైన మేరకు ఎస్​పీఎఫ్​ బలగాలను అందుబాటులో ఉంచడం, జీఓ నెంబర్ 103 అమలు, గాంధీ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సేవలను అందించటం, అత్యవసరంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్‌ని రిక్రూట్ చేయాలని కోరారు. ఆయా అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్న హామీతో జూడాలు విధుల్లో చేరుతున్నారంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

హామీ రాలేదు..

అయితే కొద్ది సేపటికే తమ డిమాండ్లకు సరైన హామీ రాలేదని... నిరసనలు కొనసాగిస్తున్నామని జూడాలు ప్రకటించారు. తమపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షకు పలువురు నాయకులు మద్ధతు తెలిపారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు సంఘీభావం ప్రకటించారు.

ఇవీ చూడండి: 'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి'

Last Updated : Jun 11, 2020, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.