ETV Bharat / city

గ్రామంలో అథ్లెటిక్స్​కు శిక్షణ..శభాష్​ అనిపించుకుంటున్న యువకుడు - చిన్నగంజాంలో క్రీడా శిక్షణ కేంద్రం

పుట్టింది... పేదింట్లో. పెరిగింది పల్లెటూర్లో. కానీ క్రీడలంటే ఆసక్తి. కష్టపడి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోచింగ్‌ సెంటర్​లో సీటు సాధించి, అథ్లెటిక్స్‌లో రెండేళ్లు శిక్షణ పొందాడు. కోచ్​గా శిక్షణ కూడా పొందాడు.. కావాలనుకుంటే తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం ఎక్కడో ఓ దగ్గర లభించేంది. కానీ.. అతడు ఆ దిశగా ఆలోచించలేదు. తనలా తన గ్రామంలో ఎంతో మంది క్రీడల్లో ఉత్సాహం చూపించే యువతీ యువకులను గుర్తించాడు. వారికి ఎక్కడికో వెళ్లి కోచింగ్‌ తీసుకునే అవకాశాలు లేవు.. అందుకే తన గ్రామంలో ఉండి, ఉన్న పరిమిత వనరులతో విద్యార్థులను అథ్లెటిక్స్‌గా తీర్చిద్దేలా.. అత్యున్నత శిక్షణ ఇస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాడా యువకుడు.

chinanganjam Games training center news
గ్రామంలో అథ్లెటిక్స్​కు శిక్షణ..శభాష్​ అనిపించుకుంటున్న యువకుడు
author img

By

Published : Apr 4, 2021, 4:28 PM IST

గ్రామంలో అథ్లెటిక్స్​కు శిక్షణ..శభాష్​ అనిపించుకుంటున్న యువకుడు

అనంతకుమార్‌ రెడ్డి స్వస్థలం ఏపీలో ప్రకాశం జిల్లాలోని చినగంజాం. ఇతనికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే విపరీతమైన ఇష్టం. కానీ.. పుట్టిన ఊరిలో ఎలాంటి క్రీడా సదుపాయాలు ఉండేవి కాదు. అయినా.. తన ఇష్టమే తనను నడిపించి.. జాతీయ స్థాయి అథ్లెటిక్స్​గా తీర్చిదిద్దింది.

సాయ్‌లో సీటు

అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకునేందుకు అనంత కుమార్‌ కుటుంబ నేపథ్యం సహకరించలేదు. నిరుపేదలైన తల్లిదండ్రుల నుంచి డబ్బులు ఆశించలేకపోయాడు. అతనిలోని ప్రతిభతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)లో సీటు సంపాదించాడు. పశ్చిమ గోదావరిలోని ఏలూరు కేంద్రంలో రెండేళ్లు శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే తనలోని క్రీడాకారుడికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు అనంత్‌ కుమార్‌.

పేద పిల్లలకు శిక్షణ

అనంతరం.. పంజాబ్‌లోని నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌- పాటియాలాలో క్రీడా శిక్షకుడిగా శిక్షణ పొందాడు. జాతీయ స్థాయి సంస్థలో విద్యాభ్యాసం చేయడంతో.. ఉద్యోగ అవకాశాలు వరుసకట్టాయి. వేల రూపాయల జీతంతో మంచి ఉద్యోగాలు అతని గుమ్మం తట్టాయి. కానీ.. వాటిన్నింటినీ కాదనుకున్నాడు. తనలాంటి పేద పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు అనంతకుమార్.

12 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో

రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు సాధించిన అనంత్‌ రెడ్డి.. 12 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆ అనుభవాన్ని పేద క్రీడాకారుల అభ్యున్నతికి వినియోగించి.. వాళ్లను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ధ్యేయమంటున్నాడు. అందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్నాడు.

సొంతూరులో కోచింగ్‌ కేంద్రం

సొంతూరులో ఓ కోచింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి... తాను అభ్యసించిన విద్యను పది మందికి నేర్పుతున్నాడు. ఇతని ఆశయం ఉన్నతంగానే ఉన్నా.. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో క్రీడా పరికరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయాడు. కానీ.. తనకున్న పరిధిలో స్వతహాగా కొన్ని పద్ధతులు, పరికరాలు రూపొందించి శిక్షణనిస్తున్నాడు ఈ ప్రకాశం కుర్రాడు.

ఉన్న వనరులతోనే మంచి ఫలితాలు

ఆరుబయట బహిరంగ ప్రదేశంలోనే ఇసుక నేలల్లో, సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో, ఉన్న వనరులతో గ్రామంలో యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. కర్రలతో తయారు చేసిన పుషప్ బార్లు, బస్సు టైర్లను స్వింగ్ బోర్డులుగా, రన్నింగ్‌ ట్రాక్‌లకు బదులు ఇసుక మేట్లలోనే శిక్షణ ఇస్తున్నాడు. శాస్త్రీయంగా శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన పరికరాలు లేకున్నా, ఉన్న వనరులతోనే మంచి ఫలితాలు సాధిస్తున్నాడు.

ఎంతోమందికి స్ఫూర్తి

తన దగ్గర శిక్షణ పొందినవారు కూడా పలు పోటీలలో పాల్గొంటున్నారు. వారికి అవసరమైన ఆర్థిక వనరులను గ్రామస్థుల సహకారంతో అనంతకుమార్​ సమకూరుస్తున్నాడు. క్రమశిక్షణ, పూర్తి స్థాయి మెళకువలతో శిక్షణ ఇవ్వడంతో.. తాము పలుచోట్ల మంచి ఫలితాలు రాబట్టగలుగుతున్నామని యువ అథ్లెటిక్స్‌ అంటున్నారు.

అవకాశాలు లేవని, వనరులు అందుబాటులో లేవని నిరుత్సాహపడకుండా పట్టుదలతో విజయాలు సాధించడమే కాక.. మరెంతో మంది యువతకు సేవలందిస్తున్న ఈ యువకుడు ఎంతోమందికి స్పూర్తి అని చెప్పుకోవచ్చు.

ఇదీ చూడండి: సీనియర్లను కాదని.. పంత్‌కే కెప్టెన్సీ ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.