ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం చెరువు కింద ఉన్న నాలా నిండిపోయి గాజుల రామారం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
గాజుల రామారం 125వ డివిజన్లోని పలు అపార్ట్మెంట్లలోకి వరద నీటితో పాటు.. పాములు, చెరువులోని కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు.. పాముల వల్ల బయటకు రాలేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి పరువు హత్య హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు