ETV Bharat / city

గడ్డిఅన్నారం మార్కెట్‌కు తాళం.. కొహెడలో క్రయవిక్రయాలు - గడ్డిఅన్నారం మార్కెట్​ వార్తలు

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ గేట్లకు ఆదివారం మార్కెట్‌ అధికారులు తాళం వేశారు. మార్కెట్లోకి పండ్ల లోడుతో వచ్చే వాహనాలను అనుమతించకుండా గేట్లు మూసివేశారు. సోమవారం నుంచి కొహెడ మార్కెట్‌లో విక్రయాలు ప్రారంభిస్తున్నామని, జీహెచ్​ఎంసీ పరిథిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే గడ్డిఅన్నారం మార్కెట్లోకి వాహనాలు అనుమతించడంలేదని అధికారులు తెలిపారు.

గడ్డిఅన్నారం మార్కెట్‌కు తాళం..  కొహెడలో క్రయవిక్రయాలు

author img

By

Published : Jul 13, 2020, 6:54 PM IST

హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డుకు అధికారులు మూసివేశారు. జీహెచ్‌ఎంసీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా... సోమవారం నుంచి మార్కెటింగ్ శాఖ నిరవధిక బంద్ ప్రకటించింది. కొత్తపేటలోని గడ్డిఅన్నారం పరిసర కాలనీవాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున.. రైతులు, వినియోగదారులు, చిల్లర, టోకు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రయ, విక్రయాలకు సంబంధించి కార్యకలాపాలు నిలిపివేసింది.

రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం... ప్రత్యామ్నాయంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొహెడలో తాత్కాలిక మార్కెట్ యార్డు ఏర్పాటు చేసింది. తొలి రోజు కొహెడకు వచ్చేందుకు కమీషన్ ఏజెంట్లు ఎవరూ ముందుకు రాలేదు. తాత్కాలిక షెడ్లు కాకుండా.. రోడ్లు, పూర్తి స్థాయి ఏర్పాట్లు, శాశ్విత నిర్మాణాలు చేపట్టిన తర్వాతే తాము కోహెడకు వస్తాయని భీష్మించుకుని కూర్చున్నారు.

ఈ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమల్ల రామనర్సింహగౌడ్ తెలిపారు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.కమీషన్ ఏజెట్లు, టోకువ్యాపారులు, హమాలీలు, ఇతరులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.