హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి షుగర్ బాక్స్ నెట్వర్క్ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా మొబైల్ డాటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది.
మొదటగా 10 మెట్రో స్టేషన్లలో షుగర్ బాక్స్ వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెట్వర్క్ ద్వారా మూడు నిమిషాల్లో సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
షుగర్ బాక్స్ వై-ఫై సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ సీఈవో రోహిత్ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరమని రోహిత్ అన్నారు. గేమింగ్, ఫుడ్, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్ వంటివి కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
- ఇదీ చూడండి: 'మందగమనం ఉన్నా ఉద్యోగాల కల్పనలో సానుకూలం'