ETV Bharat / city

బంధువులెవరూ రాలేదు.. పంచాయతీ కార్యదర్శే అంత్యక్రియలు చేశాడు! - కడప జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మానవత్వం

కరోనా భయంతో బంధువులు ఎవరూ రాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి, కార్మికుడు ముందుకు వచ్చి ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా దువ్వూరులో వెలుగు చూసింది.

Breaking News
author img

By

Published : Jul 29, 2020, 7:58 PM IST

కరోనా కాలంలో అంత్యక్రియలంటేనే బంధుగణంతోపాటు సామాన్య జనం భయపడుతున్నారు. అలాంటి ఘటనే ఆంద్రప్రదేశ్​లోని కడప జిల్లా దువ్వూరులో జరిగింది. నాగేంద్ర శ్రేష్టి అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఒంగోలులో ఉంటున్న కుమార్తై వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ఆయన అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వెంటనే స్వస్థలమైన దువ్వూరుకు తీసుకువచ్చారు.

కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో అంత్యక్రియలకు బంధుగణం ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. స్థానికులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. పంచాయతీ కార్యదర్శి ముందుకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికుడి సహాయంతో పీపీఈ కిట్​ ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.