ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలకు సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థికాశాఖ 39వ నంబర్ ఉత్తర్వును వెలువరించింది. కరోనా ప్రభావం, లాక్డౌన్తో ఆదాయం పడిపోవడం వల్ల మార్చి నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నారు. తర్వాత ఇచ్చిన సడలింపులతో రాష్ట్ర ఆదాయ పరిస్థితులు కొంత మెరుగయ్యాయి.
జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జూన్ నుంచి పూర్తి వేతనాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.