ఫోన్‌పేలో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉందని సైబర్ నేరగాళ్లు బషీర్‌బాగ్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.59 వేలు కొల్లగొట్టారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడం వల్ల ఈ మోసం వెలుగు చూసింది. సంక్షిప్త సందేశం పూర్తిగా చదవకుండానే, లింక్‌ను క్లిక్ చేయడం వల్ల మోసగాళ్లు డబ్బులను డ్రా చేసుకున్నారు. పేటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ అంబర్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.70 వేలు దోచుకున్నారు. అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చిన ఎస్ఎంఎస్లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి బాధితుడు మోసపోయాడు.
కెనడాలోఉద్యోగమిప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు కోఠికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.3 లక్షలు కాజేశారు. ఆన్లైన్లో ప్రకటన చూసి బాధితుడు వారిని సంప్రదించి వీసా, ఇతర పనుల నిమిత్తం దశల వారీగా ఆ మొత్తాన్ని చెల్లించి మోసపోయాడు.
ఇదీ చూడండి : నేటి అర్ధరాత్రి నుంచి టోల్ రుసుం వసూలు