ETV Bharat / city

France pm Jean Castex tested positive: ఫ్రాన్స్ ప్రధానికి కరోనా పాజిటివ్

corona to France pm: ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్​కు కరోనా సోకింది. విదేశీ పర్యటన అనంతరం కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అయితే ప్రధానిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా.. లేదా.. అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.

Jean Castex tested positive
Jean Castex tested positive
author img

By

Published : Nov 23, 2021, 5:52 PM IST

France's Prime Minister Jean Castex tested covid positive: ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్​కు సోమవారం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బెల్జియం సందర్శన అనంతరం కొవిడ్​ టెస్ట్​ చేయగా.. పాజిటివ్​గా తేలింది. దీంతో జీన్ కాస్టెక్స్ ఐసోలేషన్​ నుంచే తన కార్యకలాపాలను 10 రోజుల పాటు కొనసాగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారులు తెలిపారు. అయితే ప్రధానిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రధాని కాస్టెక్స్ కుమార్తెలలో ఒకరికి సోమవారం కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. దీంతో బెల్జియం పర్యటన అనంతరం కాస్టెక్స్ రెండు రకాల పరీక్షలు చేయించుకోగా.. కరోనాగా నిర్ధరణ అయినట్లు అతని కార్యాలయం తెలిపింది.

ఫ్రాన్స్​లో 75% జనాభా టీకాలు తీసుకున్నప్పటికీ.. ఇటీవల కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి : 'టీకా వేసుకోండి.. లేకపోతే కొవిడ్​ తెచ్చుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.