ETV Bharat / city

pattana pragathi: ముగిసిన పట్టణ ప్రగతి కార్యక్రమం.. పది రోజుల్లో ఏం చేశారంటే..

రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు సాగిన పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. రహదారులు, కాల్వలు, విద్యుత్​ వ్యవస్థ మరమ్మతులు, మొక్కల నాటడం వంటి కార్యక్రమాలు చేసినట్లు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ చెప్పారు.

pattana pragathi
pattana pragathi
author img

By

Published : Jul 11, 2021, 5:52 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తైంది. జులై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పదిరోజుల పాటు సాగింది. ఈ పదిరోజుల పాటు జరిగిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్ఎంసీ మినహా 141 నగర, పురపాలికల్లో 31వేల టన్నుల మేర చెత్త ఎత్తిపోసినట్లు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. 16 వేల ట‌న్నుల శిథిలాలు, వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు. 13 వేలకు పైగా కిలోమీట‌ర్ల మేర మురుగు కాలువ‌ల్లో పేరుక‌ుపోయిన పూడిక‌ తీయడం సహా చెత్త తొలగించినట్లు పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న 1,445 ఇళ్లను తొలగించినట్లు చెప్పారు.

నీరు నిలిచే అవ‌కాశం ఉన్న, నిలిచిన 5,520 ప్రాంతాల్లో మొరం పోసి చ‌దును చేసినట్లు సీడీఎంఏ తెలిపారు. రహదారుల మధ్యలో, ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో 14.66 ల‌క్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. దాంతోపాటు 44.50 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు తెలిపారు.

2,161 తుప్పుప‌ట్టిన విద్యుత్ స్తంభాల‌ స్థానంలో కొత్త ఏర్పాటుచేయడం సహా 1,643 వంగిన స్తంభాల‌ను స‌రిచేసినట్లు పేర్కొన్నారు. 78,788 మీట‌ర్ల మేర వేలాడుతున్న విద్యుత్ వైర్లను స‌రిచేసినట్లు చెప్పారు. 8,317 ద‌ళిత బ‌స్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించినట్లు సత్యనారాయణ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ అన్ని పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు.

ఇదీచూడండి: Palle pragathi: ముగిసిన నాలుగో విడత.. అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి ఆరా.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.