రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ప్రైవేట్ వైద్య కళాశాలల(Private Medical Colleges in Telangana) కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతిచ్చింది. హనుమకొండ జిల్లాలో ‘ప్రతిమ రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, రంగారెడ్డి జిల్లాలోని జఫర్‌గూడలో ‘నోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్’, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయలో ‘సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, దుండిగల్‌లో ‘అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ వైద్య కళాశాలలు(Private Medical Colleges in Telangana) 2022-23 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. ఒక్కో కళాశాల(Private Medical Colleges in Telangana) లో 150 సీట్ల చొప్పున మొత్తంగా 600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలో 44కు చేరనున్న వైద్య కళాశాలలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాల(Private Medical Colleges in Telangana) లు కలిపి 32 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నాలుగు ప్రైవేట్ కళాశాలలకు పచ్చజెండా ఊపడంతో కొత్తగా వచ్చే వైద్య కళాశాలల సంఖ్య 12కు చేరనుంది. పాతవాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 44కు చేరనుంది. కొత్తగా అనుమతి లభించిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాల(Private Medical Colleges in Telangana) ల్లో సీట్ల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
గతంలో కరోనాపై జరిపిన ఓ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలోని సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
- ఇదీ చదవండి : ఆరు జిల్లాల్లో కొత్తగా వైద్య కళాశాలలు: సీఎం