ఏపీ మండలి ఛైర్మన్ నిర్ణయంపై రైతుల హర్షాతిరేకాలు - three capitals for AP news
వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆంధ్రప్రదేశ్ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజధాని గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందడంలో రైతులు రహదారి పైకి చేరుకుని సేవ్ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.