ETV Bharat / city

paritala sunitha Comments : మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత - తెలంగాణ వార్తలు

ఇన్నాళ్లు తామంతా చాలా ఓపిగ్గా ఉన్నామని.. ఏపీలో జరుగుతున్న దాడులను చూస్తూ ఇక ఓపికతో ఉండలేమని మాజీ మంత్రి పరిటాల సునీత(paritala sunitha comments) అన్నారు. గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా తిరిగి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు గంట పాటు కళ్లు మూసుకుంటే చాలని అన్నారు.

paritala sunitha Comments
paritala sunitha Comments
author img

By

Published : Oct 22, 2021, 1:40 PM IST

Updated : Oct 22, 2021, 2:22 PM IST

మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం

వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని మాజీ మంత్రి పరిటాల సునీత(paritala sunitha comments) అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగిలేవారు కాదని వైకాపా నేతలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని మాజీ మంత్రి పరిటాల సునీత(ex minister paritala sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలోకి వచ్చాక శాంతంగా ఉండమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని అన్నారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని మండిపడ్డారు.

‘‘పరిటాల రవిని చంపినవాళ్లు రోడ్లపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదు. చంద్రబాబుపై ఉన్న గౌరవం కారణంగా సహనంతో ఉన్నాం. ఇప్పుడు మా రక్తం ఉడుకుతోంది. తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఊ.. అంటే మంత్రులను తిరగనివ్వం. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం. మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం’’ అంటూ తీవ్రస్థాయిలో సునీత విరుచుకుపడ్డారు.

ఇదీ చదవండి: Chandrababu: ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి... మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు: చంద్రబాబు

Last Updated : Oct 22, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.