ETV Bharat / city

జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి మాజీ మంత్రి ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మోకాలి నొప్పితో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం కొండపాకలో రాజేందర్​ అస్వస్థతకు గురయ్యారు.

etela rajender
ఈటల రాజేందర్​
author img

By

Published : Jul 31, 2021, 7:51 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో 'ప్రజా దీవెన' యాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. మోకాలి నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకోగానే ఈటల అస్వస్థతకు గురయ్యారు.

తగ్గిన బీపీ

వెంటనే వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధరించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగ శోభ ఉన్నారు. వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. సమాచారం అందుకున్న ఈటల సతీమణి.. హుటాహుటిన కొండపాక చేరుకున్నారు. బీపీ90/60, షుగర్‌ లెవెల్‌ 265గా నమోదైంది. ప్రత్యేక బస్సులో వైద్యులు చికిత్స అందించారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్‌ తరలించారు.

19న ప్రారంభమైన పాదయాత్ర

పార్టీ నేతల భరోసాఈ నెల 19న హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ‘ప్రజా దీవెన యాత్ర’ను ఈటల ప్రారంభించారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 70 గ్రామాల్లో 222 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈటల రాజేందర్‌ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఈటల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈటలకు భాజపా అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. కాగా యాత్ర నిన్నటితో 12వ రోజుకి చేరుకుంది.

ఇదీ చదవండి: IPS: పోలీసు వ్యవస్థపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించండి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.