భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత ఊరైన హుజూరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో తన సొంత నియోజకవర్గానికి పయనమయ్యారు. భారీ సంఖ్యలో కార్లతో అనుచరులు, మద్దతుదారులు ఆయన వాహనాన్ని అనుసరించారు. దీంతో జాతీయ రహదారి వెంబడి కోలాహల వాతావరణం నెలకొంది. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఈటల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణను అక్కడ కార్యకర్తలు, తన అనుచరులతో చర్చించనున్నారు.
ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట భూములు ఈటల కబ్జా చేశారంటూ రైతులు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత సీఎం విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖను బదిలీ చేయాలన్న ప్రభుత్వం సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఈ ఆమోదంతో శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ మారారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
-
ప్రజల దగ్గరికి.. ప్రజా నాయకుడు.. https://t.co/5KZHV9xcqy
— Eatala Rajender (@Eatala_Rajender) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రజల దగ్గరికి.. ప్రజా నాయకుడు.. https://t.co/5KZHV9xcqy
— Eatala Rajender (@Eatala_Rajender) May 3, 2021ప్రజల దగ్గరికి.. ప్రజా నాయకుడు.. https://t.co/5KZHV9xcqy
— Eatala Rajender (@Eatala_Rajender) May 3, 2021
ఇదీ చదవండి: చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్