ETV Bharat / city

అల్పాహార విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్​..

Former Karnataka cm Kumaraswamy meet CM KCR: ప్రగతిభవన్‌లో అల్పాహార విందులో జేడీఎస్‌, వీసీకే పార్టీ నేతలు పాల్గొన్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు తీసుకున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విందులో పాల్గొన్నారు. ఈ భేటీలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.... తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారితో కలిసి కేసీఆర్‌ అల్పాహారం సేవించారు.

kcr
కేసీఆర్​
author img

By

Published : Oct 5, 2022, 11:58 AM IST

Former Karnataka cm Kumaraswamy meet CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రకటిస్తుండడంతో... ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు కుమారస్వామి, తిరుమావళవన్ తరలివచ్చారు. ప్రగతిభవన్ వచ్చిన కుమారస్వామి, తిరుమావళవన్ బృందాన్ని... తెరాస అధినేత కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు. ఈ భేటీలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.... తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారితో కలిసి కేసీఆర్‌ అల్పాహారం సేవించారు. అనంతరం ఆ నేతలిద్దరితో సమావేశమయ్యారు. భేటీ తర్వాత కేసీఆర్‌ మంత్రులు, ఇతర నేతలు కలిసి... తెలంగాణ భవన్‌లో సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.