బాదం: వీటిలో మాంగనీస్, విటమిన్-ఇ, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి రోజూ గుప్పెడు బాదం గింజలను చిన్నారులకు పెట్టండి.
పెరుగు: దీని ద్వారా పొటాషియం, మెగ్నీషియంలతోపాటు ఎముకలు దృఢంగా మారడానికి అవసరమయ్యే క్యాల్షియం కూడా లభిస్తుంది. రోజూ రెండు పూటలా కప్పు పెరుగు తీసుకునేలా చూడండి.
చేపలు: వీటిలో శరీరానికి మేలు చేసే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి మెదడు ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. వ్యాధి నిరోధకతనూ పెంచుతాయి. పిల్లలకు నచ్చేలా ముళ్లు లేకుండా కట్‌లెట్ మాదిరిగా చేసిస్తే ఇష్టంగా తింటారు.
పాలకూర: దీనిలోని విటమిన్లు, మినరళ్లు కావాల్సిన శక్తిని అందించడంతోపాటు రోగనిరోధకతను పెంపొందిస్తాయి. దీంట్లో విటమిన్-ఎ, సి, ఇ, కె ఉంటాయి. ఫొలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఇనుము లభిస్తాయి.
గింజలు: గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. వీటిలో విటమిన్-ఇ, జింక్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో ముందుంటాయి.