ETV Bharat / city

ఆఫర్లు చూసి టెంప్ట్.. పార్శిల్ ఓపెన్ చేస్తే కంపు - food adulteration in Hyderabad through food delivery

ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో ఆహార తయారీ కేంద్రాలు పెరిగాయి. చూడటానికి కలర్​ఫుల్​గా ఉంటే చాలు తెగ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. కానీ దాని నాణ్యత గురించి, ఆ హోటళ్లకు లైసెన్సు ఉందా లేదా అని పట్టించుకోకుండా ఆఫర్లు ఉన్నాయని ఆశగా ఆర్డర్ చేసేస్తున్నారు. కల్తీ ఆహారం తిని అనారోగ్యాలపాలవుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో ఆన్​లైన్ ఆర్డర్ల ద్వారా కల్తీ ఆహార దందా జోరుగా సాగుతోంది.

Food adulteration in online food delivery, Zomato, Swiggy, Uber Eats, Hyderabad
ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, హైదరాబాద్​లో ఆహార కల్తీ
author img

By

Published : Jun 28, 2021, 8:39 AM IST

Updated : Jun 28, 2021, 11:18 AM IST

రాష్ట్ర రాజధానిలో ఆహార కల్తీ జోరుగా సాగుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు భారీగా పెరిగాయి. అనధికారికంగా చాలా మంది బిర్యానీ కేంద్రాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తెరిచారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే రంగులు, కుళ్లిన మాంసాహారం, పాచిపోయిన కూరలను వేడి చేసి వినియోగదారులకు పంపిస్తున్నారు. ఇదేమీ తెలియని పౌరులు.. రాయితీలు ఇస్తున్నారన్న కారణంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆహారం సరఫరా చేసే సంస్థలు తాము తీసుకెళుతున్న హోటళ్లు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా, లేదా, వాటికి లైసెన్సు ఉందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోవడంలేదు. జీహెచ్‌ఎంసీ ఆహారకల్తీ విభాగం తనిఖీలకు, చర్యలకు ఉపక్రమించకపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం తలెత్తుతోంది.

నామమాత్రంగా కేసులు

ఆహార కల్తీ కింద బల్దియా 2015 నుంచి నమోదు చేసిన కేసులు మున్సిపల్‌ కోర్టుల్లో 60 నుంచి 70 వరకు విచారణలో ఉన్నాయి. 8 మందికి ఆరు నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధించారు. తాజాగా గోల్నాకలోని ఓ కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ కేసు నమోదు చేసింది.

సంధానకర్తలమే.. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు రావడంతో ఆహార తయారీ కేంద్రాలు పెరిగాయి. హోటళ్లు ఇచ్చే పార్సిళ్లలోని మాంసాహారం, ఫాస్ట్‌ఫుడ్‌ తదితర పదార్థాలు నాణ్యమైనవా లేదా తెలుసుకోకుండానే సరఫరా చేసేస్తున్నాయి. డెలివరీ ఇచ్చే పదార్థాలకు సంబంధించి రోజూ 20 నుంచి 30 మంది వినియోగదారులు బల్దియాకు ఫిర్యాదు చేస్తున్నారు. వివరణ కోరగా.. తాము తయారీదారులకు, వినియోగదారులకు సంధానకర్తలు మాత్రమేనని అధికారులకు చెబుతున్నాయి.

ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ

ఆకట్టుకొనే పార్సిళ్లలో..

ఆన్‌లైన్‌ ఆర్డర్ల కోసం ఆకట్టుకొనే పార్శిళ్లను రూపొందించి డెలివరీ చేస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో తనిఖీ చేస్తున్నప్పుడు గుర్తించామని జీహెచ్‌ఎంసీ గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అదేమంటే.. నాణ్యత లేని పదార్థాలతో తయారు చేసి ఆఫర్ల మాటున అమ్మేస్తుంటామని బదులిచ్చినట్లు పేర్కొన్నారు.

ఖాళీలు భర్తీ చేసినా తనిఖీల్లేవు

సుమారు కోటి వరకు జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఏడాది వరకు కేవలం ముగ్గురు సీనియర్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. ఖాళీలను భర్తీ చేయడంతో 21 మందికి పెరిగారు. భర్తీ చేసి ఏడాది అవుతున్నా ఆహారకల్తీ నివారణకు వారు ఎలాంటి తనిఖీలు చేయలేదు. సర్కిళ్ల స్థాయిలో పనిచేయించాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని పలువురు జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్లు ఇటీవల కమిషనర్‌ లోకేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వారం నుంచి తనిఖీలు చేస్తున్నామని, నమూనాలను సేకరిస్తున్నామని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు చెబుతున్నారు. ఒకొక్కరు నెలకు ఆరు నమూనాలను పరీక్షలకు పంపాలని అధికారులు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.

ఆందోళనకర స్థాయిలో మిశ్రమాలు

జీహెచ్‌ఎంసీ చెబుతున్న వివరాల ప్రకారం.. 90 శాతం ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో మంచూరియా, చికెన్‌ 65, ఇతర పదార్థాల తయారీలో ఎర్ర రంగును పరిమితికి మించి వాడుతున్నారు. బేకరీ పదార్థాల తయారీలోనూ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపు రంగులను ఎక్కువ వినియోగిస్తున్నారు. హోటళ్లలోనూ అంతే. సామర్థ్యం లేని శీతలపెట్టెల్లో రోజుల తరబడి మాంసాన్ని, కూరలు, చపాతీ పిండి, ఇతర పదార్థాలను పెడుతున్నారు. అవసరమైనప్పుడు, పాచి వాసన రాకుండా మసాలా కలిపి నూనెలో వేయిస్తున్నారు.

చర్యలకు అడ్డంకులు.. జరిమానాలతో సరి

ఆహార కల్తీ నివారణ చట్టం ప్రకారం ఉల్లంఘనులపై న్యాయస్థానం ద్వారా చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలుగు నమూనాలను వేర్వేరుగా సేకరిస్తారు. ఒకటి నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకి పంపిస్తారు. మిగిలిన వాటిని భద్రపరుస్తారు. 14 రోజుల్లోపు ప్రయోగశాల నివేదిక వస్తుంది. హానికరం అని తేలితే.. బాధ్యులకు నోటీసులివ్వాలి. అవతలి నుంచి జవాబు వచ్ఛి. ఛార్జిషీటు రాసి కేసు నమోదు చేసే సరికి 45 రోజులు పడుతుంది. అప్పుడు మున్సిపల్‌ కోర్టులో విచారణ మొదలై కొన్ని రోజులకు తీర్పు వెలువడుతుంది. తీర్పును సవాలు చేస్తూ పైకోర్టును ఆశ్రయించేవారు, ప్రయోగశాల నివేదికను సవాలు చేసే వారు అధికంగా ఉంటున్నారు. అలాంటప్పుడు.. భద్రపరిచిన ఓ నమూనాను ఇతర రాష్ట్రాల్లోని ప్రయోగశాలకు పంపించి నివేదిక కోరతారు. అందువల్ల కల్తీరాయుళ్లపై జీహెచ్‌ఎంసీ అపరిశుభ్రత నేరం కింద జరిమానా వేస్తోంది.

Last Updated : Jun 28, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.