ETV Bharat / city

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు - ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు

author img

By

Published : Mar 17, 2022, 10:35 AM IST

10:13 March 17

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జానపద గాయకుడు

గిరిజనుల ఇతివృత్తంగా యూట్యూబ్‌లో పాటలు పాడే యువ గాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోని ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పిల్లిగుండ్లతండాకు చెందిన జటావత్‌ మోహన్‌(20) డిగ్రీ చదువుతున్నాడు. చంపాపేట డివిజన్‌ రెడ్డికాలనీ సమీప బస్తీలో అద్దె గదిలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. యూట్యూబ్‌లో పాటలు పాడేవాడు. జీవనోపాధికి ఆటో నడిపేవాడు.

మంగళవారం రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న అతను.. 11 గంటల సమయంలో ఉరి వేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘తన చావుకు ఎవరు బాధ్యులు కారని’ రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియాలో శవ పరీక్ష అనంతరం కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ కె.సుబ్బరామిరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: తండ్రి బాటలో తనయుడు.. నాన్న చనిపోయిన చోటే ఉరేసుకుని..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.