ETV Bharat / city

వీటితో ఇంటిని నిమిషాల్లో శుభ్రం చేసేయవచ్చు!

‘ఇంటిని చూసి.. ఇల్లాలిని చూడు..’ అన్నారు పెద్దలు. ఇంటిని శుభ్రంగా ఉంచిన విధానం.. ఇల్లాలి స్వభావాన్ని తెలుపుతుందనేది ఈ సామెత అర్థం. అంతేకాదు.. అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు ఎన్నో వ్యాధులకు ఆలవాలమవుతుంది కూడా! కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జబ్బులు వ్యాపించకుండా నివారించుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం బిజీ బిజీ జీవితాల వల్ల ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేయాలంటే వీలుకాకపోవచ్చు. ఇక ఒకేసారి మొత్తం ఇల్లంతా అంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే. అలాంటి వారి సమస్యకు చెక్‌ పెట్టడానికి ఈ ఆధునిక ‘ఫ్లోర్‌ క్లీనర్స్‌’ని డిజైన్‌ చేశారు. ఈ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగించడం వల్ల మీ టైం ఆదా అవడంతోపాటు.. నిమిషాల్లో నేలతో పాటు, గోడలు, సింక్‌ లాంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు. మరి, మీ ఇంటి పనుల్లో మీకెంతగానో ఉపకరించే వివిధ రకాల మోడ్రన్‌ ఫ్లోర్ క్లీనర్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

వీటితో ఇంటిని నిమిషాల్లో శుభ్రం చేసేయచ్చు !

author img

By

Published : Aug 3, 2020, 1:07 PM IST

వాక్యూమ్‌ క్లీనర్‌.. ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి ఇప్పుడు దీన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. అయితే అది పెద్దగా ఉండడం, దాన్ని వాడడంలో ఎదురయ్యే ఇబ్బంది కారణంగా చాలామంది ఆ క్లీనర్‌ని పక్కన పడేస్తుంటారు. అలాంటి వారికోసమే తేలికపాటి, ఈజీగా వాడగలిగే వాక్యూమ్‌ క్లీనర్‌ని మన ముందుకు తెచ్చారు డిజైనర్లు. అదే ‘ఆటోమేటిక్‌ స్వీపింగ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌’.

ఇది చూడడానికి మాప్‌లా ఉంటుంది. దీని అడుగుభాగంలో ఉండే చీపురు లాంటి అమరికతో ఇల్లు ఊడవడం; ఫ్లోర్‌పై ఉండే సన్నటి దుమ్ము-ధూళిని తొలగించడం; సోఫాలు, మ్యాట్‌లు, కర్టెన్స్‌.. లాంటి వాటిని శుభ్రం చేయడం.. వంటి పనుల్ని ఈజీగా చేసేసుకోవచ్చు.

దీన్ని స్టిక్‌లా ఉపయోగిస్తూనే.. అవసరమైనప్పుడు మధ్య భాగానికి వంచి ఇంట్లోని అన్ని మూలలు, సోఫా-టేబుల్స్‌ కింద కూడా మనం వంగే పని లేకుండా శుభ్రం చేసుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించే ముందు రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై స్టిక్‌కి అమరి ఉన్న స్విచ్‌ను ఆన్‌ చేయగానే అడుగుభాగంలో ఉండే స్వీపింగ్‌ బ్రష్‌లు తిరుగుతూ చెత్తా-చెదారం, దుమ్మును సేకరించి దానికి అటాచ్‌డ్‌గా ఉన్న చిన్న బాక్స్‌లో వేసేస్తాయి. శుభ్రం చేయడం పూర్తయిన తర్వాత ఆ బాక్స్‌కి ఉన్న మీటను నొక్కగానే డస్టంతా బయటకు వస్తుంది. ఇలా ఎంతో ఈజీగా, తక్కువ సమయంలోనే ఫ్లోర్‌ని శుభ్రం చేసేసుకోవచ్చు. దీని నాణ్యతని బట్టి ధర రూ.1250 నుండి రూ.1600 వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ స్పిన్నింగ్‌ స్క్రబ్బింగ్‌ మెషీన్‌

సాధారణంగా నేలను తుడవడానికి ఉపయోగించే గ్యాడ్జెట్‌తో సింక్‌, గోడలు లాంటివి శుభ్రం చేయలేం. అందులోనూ నేలమీదైనా, గోడలపైనైనా ఏవైనా మరకలు పడినప్పుడు సోప్‌ లిక్విడ్‌ వేసి బ్రష్‌తో రుద్దడం కామనే. అదే పనిని మరింత సులభతరం చేసింది ‘ఎలక్ట్రిక్‌ స్పిన్నింగ్‌ స్క్రబ్బింగ్‌ మెషీన్‌’. మాప్‌లా ఉండి.. దీనికి అడుగు భాగంలో కాస్త గరుకైన బ్రిజిల్స్‌ ఉండే బ్రష్‌ అమరి ఉంటుంది. రీఛార్జ్‌ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. స్టిక్‌ లాంటి ఈ గ్యాడ్జెట్‌ చివర అమర్చుకోవడానికి మూడు రకాల బ్రష్‌లు ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఆయా బ్రష్‌లను మార్చుకుంటూ నేల, సింక్‌, బాత్‌ టబ్‌, గోడలు.. ఇలా అన్నింటినీ శుభ్రం చేసుకోవచ్చు. అలాగని చేత్తో గట్టిగా రుద్దాల్సి ఉంటుందని కంగారు పడకండి. ముందుగా రీఛార్జ్‌ చేసిన తర్వాత స్టిక్‌కి అమరి ఉన్న స్విచ్‌ను ఆన్‌ చేస్తే చాలు.. స్టిక్‌ చివర ఉన్న బ్రష్‌ ఆటోమేటిక్‌గా తిరుగుతూ శుభ్రం చేసుకుంటూ పోతుంది. ఈ గ్యాడ్జెట్‌తో పని ఈజీగా పూర్తవుతుంది కదూ! దీని నాణ్యతని బట్టి ధర రూ.1400 నుండి రూ.2000 వరకు ఉంటుంది.

బాత్‌రూం క్లీనింగ్‌ కంఫర్ట్‌ బ్రష్

సాధారణంగా ప్రతి ఇంట్లో బాత్‌రూం క్లీన్‌ చేయడానికి సెపరేట్‌ బ్రష్‌లను ఉపయోగిస్తుంటాం. బాత్‌రూం టైల్స్‌ని క్లీన్‌ చేయాలంటే కాస్త పొడవైన స్టిక్‌ ఉన్న బ్రష్‌.. అదే గోడలు లాంటివి క్లీన్‌ చేయాలంటే చేత్తో ఉపయోగించే బ్రష్‌ని వాడుతుంటాం. అందులోనూ ఆ బ్రష్‌ బ్రిజిల్స్‌ కాస్త గరుకుగా ఉంటే మురికి త్వరగా వదిలిపోతుంది.

ఇలా ఒకే పనికి రెండు, మూడు గ్యాడ్జెట్స్‌ని కొనాలంటే డబ్బు వృథా అవడంతోపాటు.. టైం కూడా వేస్ట్‌. అలాంటి వృథా తగ్గించడానికే మన ముందుకొచ్చింది ‘బాత్‌రూం క్లీనింగ్‌ కంఫర్ట్‌ బ్రష్‌’. చిత్రంలో చూపించిన విధంగా నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే మాప్‌లాగానే ఉంటుందిది. అయితే దీనికి అడుగు భాగంలో గరుకైన బ్రిజిల్స్‌ కలిగిన బ్రష్‌ని అమర్చుతారు. దీంతో బాత్‌రూం టైల్స్‌ని శుభ్రం చేసుకోవచ్చు. ఆపై గోడలను క్లీన్‌ చేసుకునేటప్పుడు స్టిక్‌కి ఉన్న బ్రష్‌ని విడదీసి ఫొటోలో చూపించినట్లుగా సెపరేట్‌గా వాడుకోవచ్చు. ఇలా ఒకే గ్యాడ్జెట్‌ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీని నాణ్యతని బట్టి ధర రూ.380 నుండి రూ.500 వరకు ఉంటుంది.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మాప్‌ రింగర్‌

పెరిగిపోతున్న కాలుష్యం వల్ల రోజూ ఇల్లు ఊడవడంతో పాటు తుడవకుండా అలాగే వదిలేస్తే ఫ్లోర్‌పై ఇంకా మురికి పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా, క్రిములు కూడా నేలపై ఉండిపోతాయి. ఇక వాటిని నాశనం చేయాలంటే సోప్‌ లిక్విడ్‌ వాటర్‌ తప్పనిసరి. ఇలాంటి మిశ్రమాన్ని కలుపుకోవడం, రోజూ ఇల్లు తుడవడం ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. అందులోనూ వర్కింగ్‌ విమెన్‌కి అంత తీరిక దొరక్కపోవచ్చు.

అందుకే నేలను శుభ్రం చేయడంలో మీ పనిని మరింత సులభతరం చేయడానికి మార్కెట్లో కొలువుదీరింది ‘స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మాప్‌ రింగర్‌’. ఇది చూడడానికి సాధారణంగా ఇంట్లో ఉపయోగించే మాప్‌ కర్రలా ఉంటుంది. అడుగున ఉన్న మాప్‌ను 360 డిగ్రీలు తిప్పుకునేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాదు.. మన అవసరాన్ని బట్టి ఈ స్టిక్‌ పొడవును కూడా పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు.

ఇక మాప్‌ కర్రతో పాటు చిన్న బకెట్‌, దానికి సోప్‌ లిక్విడ్‌ బాటిల్‌ అమర్చుకునేందుకు చిన్న బాక్స్‌, ఆ పక్కనే నీటిని పిండేసే మెషీన్‌.. ఇలా అన్నీ ఒకేదాంట్లో అమరి ఉంటాయి. ఈ బకెట్‌ని మోయాల్సిన పనిలేకుండా లాక్కుని వెళ్లడానికి వీలుగా అడుగున వీల్స్‌ కూడా అమరి ఉంటాయి. ఒకేవేళ మాప్‌ పాడైపోతే.. దానిని మాత్రమే కొనుగోలు చేస్తే సరి. నాణ్యతని బట్టి దీని ధర రూ.1120 నుండి రూ.2500 వరకు ఉంటుంది.

రోబోటిక్‌ స్వీపింగ్‌ వాక్యూమ్‌ క్లీనర్

చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అస్తమానం ఏదో ఒకటి కింద పడేయడం చేస్తుంటారు. అలా చేసిన ప్రతిసారీ ఊడ్చుకోవాలంటే ఎవరికైనా కష్టమే. అందుకే కూర్చున్న చోట నుండి లేవాల్సిన పని లేకుండానే.. నేలపై పడిన దుమ్మును చిటికెలో శుభ్రం చేయడానికి వీలుగా రూపొందించారీ ‘రోబోటిక్‌ స్వీపింగ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌’. చిత్రంలో చూపించిన విధంగా గుండ్రటి బాక్స్‌లా ఉంటుంది. ఉపయోగించడానికి ముందు దీన్ని రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆపై బాక్స్‌కు అమరి ఉన్న స్విచ్‌ను ఆన్‌ చేసి దుమ్ము ఉన్న చోట పెడితే చాలు.. బాక్స్‌కి అడుగుభాగంలో ఉండే స్వీపింగ్‌ బ్రష్‌ల సహాయంతో మీ ప్రమేయం లేకుండానే ఆ ప్రదేశంలోని దుమ్మును సమూలంగా శుభ్రం చేస్తుంది. ఆ దుమ్మంతా రోబోటిక్‌ స్వీపర్‌ కింద అమర్చి ఉన్న బాక్స్‌లోకి చేరుతుంది. శుభ్రం చేయడం పూర్తైన తర్వాత బాక్స్‌ ఓపెన్‌ చేసి క్లీన్‌ చేసుకుంటే సరి. దీని నాణ్యతని, డిజైన్‌ని బట్టి ధర రూ.1500 నుండి రూ.5500 వరకు ఉంటుంది.

గమనిక : ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఈ గ్యాడ్జెట్స్‌ని క్లీన్‌ చేయడం మరవకండి. మనం ఉపయోగించే గ్యాడ్జెట్స్‌ క్లీన్‌గా ఉన్నప్పుడే మన ఇల్లు కూడా అత్యంత శుభ్రంగా ఉంటుంది.

ఇవీ చూడండి : గ్రేటర్‌ పరిధిలో తగ్గని కరోనా వ్యాప్తి... 500కు పైగా నమోదవుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.