అర్హులైన వరద బాధితులందరికీ రూ.10 వేల సాయం అందించాలని హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తక్షణమే రూ.10 వేలు ఇవ్వాలని అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో వరద బాధితులు బైఠాయించారు. పనులు వదిలిపెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్ల యజమానులకు... అధికార పార్టీ నాయకులు పిలిపించుకొని మరీ డబ్బులు ఇప్పిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసినప్పుడే గుర్తుకొస్తామని... తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు పట్టించుకోరని మండిపపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని అర్హులైన వరద బాధితులకు న్యాయం చేయాలని కోరారు.