అసెంబ్లీ పాతభవనం మొదటి అంతస్తు పెచ్చులూడి కిందపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. పెచ్చులూడిన దగ్గర అవసరమైన మేరకు వెంటనే మరమ్మతులు చేపడతామని శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. అసెంబ్లీ పాత భవనం నిర్మించి వందేళ్లకు పైగా అయిందని పేర్కొన్నారు.
అప్పటి సాంకేతిక పరిజ్ఞానం, డంగు సున్నంతో ఆ భవనాన్ని నిర్మించారని నర్సింహాచార్యులు తెలిపారు. కాలక్రమంలో గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమన్నారు. అసెంబ్లీ ఇంజినీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రతి ఏడాది మరమ్మతులు చేపడతుందని నరసింహాచార్యులు వివరించారు.
ఇదీ చూడండి: వైద్యరంగంలో ఏఐది కీలకపాత్ర: సత్యనాదెళ్ల