Flexi Conflict: ఏపీలోని విజయవాడ బెరంపార్క్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకటన విమర్శలకు తావిస్తోంది. 'మా బార్లో అన్ని రకాల మద్యంపై తగ్గింపు ధరలు' అని మద్యం సీసాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బెరంపార్క్ ప్రధాన ద్వారం, పార్క్ లోపల ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేయటంతో సందర్శకులు విస్తుపోతున్నారు.
పార్క్‌కు విదేశాల నుంచి సైతం యాత్రికులు వస్తుండటంతో బార్ ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో సందర్శకులు బెరంపార్క్కు వెళుతుంటారు. అటువంటి ప్రదేశంలో ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేయటం ఏంటని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి :