ETV Bharat / city

Five Steps Farming: ఐదంతస్తుల సాగుబడి.. ఏడాది పొడవునా దిగుబడి

ఎటుచూసినా దుర్భిక్షం.. ఆకాశం వైపు ఎన్నిసార్లు చూసినా రాలిపడని చినుకు.. తడవని నేల.. నడవని బతుకులు.. ఎన్నాళ్లు ఇలా అనుకున్నారు ఆ అతివలు. మార్పు కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూడలేదు.. కరవు నేలపై సిరుల పంటకు శ్రీకారం చుట్టారు. సాగు రంగంలో ఐదంతస్తుల విధానానికి(Five Steps Farming) తెరతీశారు. ఐదంతస్తుల భవనం చూశాం కానీ.. ఐదంతస్తుల వ్యవసాయం ఏంటీ అంటారా?..ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఏపీలోని చిత్తూరు జిల్లాకు వెళ్లాల్సిందే.

Five Steps Farming
ఐదంతస్తుల సాగుబడి
author img

By

Published : Oct 25, 2021, 9:57 PM IST

వర్షాభావ పరిస్థితులు.. ఏటా పలకరించే కరవు.. ఎంత కష్టపడినా.. సాగు చేసిన పంట చేతికి వస్తుందో లేదోనన్న భయం. వీటన్నిటి మధ్య నష్టాల్లో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రైతులు.. సరికొత్త వ్యవసాయం వైపు దృష్టి సారించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడంతో పాటు.. ఏడాది పొడవునా ఆదాయం సమకూరే ఐదంతస్తుల వ్యవసాయం వైపు(five steps farming) మొగ్గుచూపుతున్నారు.

భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా

అతి తక్కువ విస్తీర్ణంలో 30 రకాల పంటలు(Five Steps Farming) సాగుచేస్తున్నారు. రైతు ఆసక్తికి అనుగుణంగా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను అనుసరించి, పలు రకాలు పంటలు సాగుచేస్తున్నారు. మొదటి అంతస్తుగా మామిడి, దానిమ్మ, అల్లనేరేడు, బత్తాయి వంటి పండ్ల రకాలు.. రెండో అంతస్తులో బొప్పాయి, నిమ్మ, జామ రకాలు.. మూడో అంతస్తులో టమోటా, బెండ, వంగ, మిరప వంటి కూరగాయలు.. నాలుగో అంతస్తులో పాలకూర, కొత్తిమీర, గోంగూర, చుక్కకూర వంటి ఆకు కూరల రకాలు.. ఐదో అంతస్తులో ముల్లంగి, ఉల్లి, క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి దుంపకూరలు సాగు చేస్తున్నారు. ఈ విధానం మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్తూరు జిల్లా రైతులు.

36 అడుగులకు కొన్ని చెట్లు, 18 అడుగులకు కొన్ని చెట్లు, 9 అడుగులకు మరికొన్ని చెట్లు సాగు చేశాం. ఎక్కువ నీడ, తక్కువ నీడకు పండే పంటలను చూసుకుంటూ వేస్తున్నాం. దీని ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాం. -లక్ష్మీ, అంకిశెట్టి పల్లి

అర్ధ ఎకరం లీజు తీసుకుని ఐదంతస్తుల వ్యవసాయం చేశాం. మొదటి ఏడాది లక్షన్నర పైగా లాభం వచ్చింది. ఏడాది పొడవునా సాగు ఉండేలా చూస్తున్నాం. టమాటా, వంగ, మిరప, బొప్పాయి, బీర, ఆకుకూరలు తదితర పంటలు వేశాను. తద్వారా ఒక పంట అయిపోగానే మరో పంట ద్వారా ఆదాయం గడిస్తూనే ఉన్నాం. - ఖాదర్‌ బీ, కొత్తపల్లి

బీడు భూములను పంట పొలాలుగా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు ఐదంతస్తుల(Five Steps Farming) వ్యవసాయంతో లాభాలు గడిస్తుండగా.. మరింత మంది రైతులు ఐదంతస్తుల వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఐదంతస్తుల వ్యవసాయం ద్వారా అధిక లాభాలు రావడంతో పాటు రైతులు మక్కువ చూపుతున్నందున.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సాగును పోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీడు భూములను పంట పొలాలుగా మార్చడానికి పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి అంతస్తుగా సాగుచేసే పండ్ల మొక్కల కొనుగోలు, గుంతల తవ్వకం, వాటి నిర్వహణ ఖర్చులకు నరేగా నిధులను కేటాయిస్తున్నారు.

ఐదంతస్తుల సాగుబడి.. ఏడాది పొడవునా దిగుబడి

ఇదీ చదవండి:

sand arrears: సర్కార్​ను వీడని ఇసుక కష్టాలు.. రూ.150 కోట్లు బాకీ పడ్డ జేపీ సంస్థ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.