హైదరాబాద్లోని ముషీరాబాద్ చేపల మార్కెట్ మురికి కూపంగా మారింది. కొత్తగా రోడ్డు వేయడానికి భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టడం వల్ల డ్రైనేజీ పైపులు, మంచినీటి పైపులు పగిలి చేపల మార్కెట్ అపరిశుభ్రంగా మారింది. అయినా అమ్మకందారులు అదే మురికి కూపంలో చేపలు, రొయ్యలు విక్రయిస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ఈ అపరిశుభ్రమైన ప్రాంగణంలో చేపల విక్రయంతో మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రజలు వాపోతున్నారు. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగినా పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. వీలైనంత త్వరగా అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో 'యాస్' బీభత్సం