ETV Bharat / city

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం.. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం - తెలంగాణ తాజా వార్తలు

ALERT AT DHAVALESWARAM: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరదనీటి ప్రవాహం పెరుగుతున్నట్టు.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 10.04 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేవరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

godavari
godavari
author img

By

Published : Sep 13, 2022, 10:07 PM IST

FIRST ALERT AT DHAVALESWARAM : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద వరద ప్రవాహం ప్రమాదకరస్థాయిని దాటి పోయిందని.. ప్రస్తుతం ఆ వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 10.04 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రభావిత మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంప్రదించాల్సిన నెంబర్లు 1070, 18004250101, 08632377118.

యానాం ప్రజలకు మొదలైన కష్టాలు : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. గౌతమి, గోదావరి వరద పోటెత్తడంతో.. యానాం ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పట్టణ వీధుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్లూయిజ్ నుంచి నీళ్లు రావడంతో ఇసుక బస్తాలు వేసి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాలనీలు నీట మునగడంతో.. బాధితులు పునరావస కేంద్రాలకు తరలివెళ్లాలని రెవెన్యూ అధికారులు సూచించారు. కోనసీమ జిల్లాల్లో లంకలను వరదనీరు ముంచెత్తుతోంది. ఈ ఏడాది వరుసగా మూడోసారి వరద రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ కష్టాలు తీరేదెప్పుడో అని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.