Car Fire Accident: ఏపీ తిరుపతి జిల్లా తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుల వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో క్షణాల్లో కారులో మంటలు అంటుకోవడంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడున్న తితిదే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవీ చదవండి: