జీడిమెట్ల ఫేజ్-5లోని కృష్ణ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అంటుకుని రసాయన డ్రమ్ములు పైకి ఎగిరిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు పరిశ్రమ కార్మికులకు గాయాలయ్యాయి. పరిశ్రమ లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. రాత్రి 11 గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు.
ఇవీ చూడండి: ప్రారంభానికి 'కొండపోచమ్మ' సిద్ధం.. ప్రత్యేక పూజలు