ETV Bharat / city

Minister Harish Rao : 'ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్​ వల్లే.. భూగర్భజలాలు పెరిగాయి' - telangana minister harish rao

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సాగునీటిపైనే దృష్టిసారించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను 100 శాతం వినియోగించుకోవాలని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్​డ్యాంలు, చెరువుల్లో 365 రోజులు నీరు నిల్వ ఉండేలా తీసుకున్న చర్యల వల్ల గతేడాది కంటే భూగర్భజలాలు 3.06 శాతం పెరిగాయని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న చెక్​డ్యాంల నిర్మాణం పూర్తయ్యాక..అవసరం ఉన్న చోట్ల మరికొన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Oct 4, 2021, 10:57 AM IST

Updated : Oct 4, 2021, 12:25 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్​ వల్లే.. భూగర్భజలాలు పెరిగాయి

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ముఖ్యంగా నీళ్ల కోసమేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజల వలసలు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు.. గత ప్రభుత్వాలు సాగునీటిపై దృష్టి సారించకపోవడం వల్లేనని తెలిపారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై దృష్టి పెట్టారని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను 100 శాతం వినియోగించుకోవాలని కేసీఆర్ చెప్పినట్లు వివరించారు. గోదవారిలో రాష్ట్రానికి హక్కుగా ఉన్నటువంటి 928 టీఎంసీలు, కృష్ణా నదిలో ప్రస్తుతం తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీటిని ప్రజలకు ఉపయోగకరంగా వినియోగించేందుకు ఒడిసిపట్టాలని సీఎం అన్నారని తెలిపారు. రాష్ట్రంలో చెక్​ డ్యాంలను నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలపై మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్​ రావు సమాధామిచ్చారు.

రాష్ట్రంలో భారీ రిజర్వాయర్లను నిర్మించి.. వరద నీటిని వాటిలో నిల్వ చేసి రాష్ట్ర ప్రజలకు 365 రోజులు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటమే కేసీఆర్ ధ్యేయమని హరీశ్ రావు(Minister Harish Rao) చెప్పారు. వాటిలో భాగంగానే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్​ జలాశయ నిర్మాణం పూర్తి చేసి నీటి పంపింగ్​ కూడా మొదలుపెట్టామని వెల్లడించారు.

"మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులన్ని పునరుద్ధరించాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వర్షాలు పడినా.. ఒక్క చెరువు కూడా తెగలేదంటే.. అది మిషన్ కాకతీయ కార్యక్రమం గొప్పదనమే. నెలల తరబడి చెరువులు అలుగు పారుతున్నాయి కానీ ఒక్క చెరువు కూడా తెగలేదు."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ప్రతి నది, వాగుల మీద చెక్​డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్(Minister Harish Rao) అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత చేదబాయిలో చెంబులతో ముంచుకునే పరిస్థితులు వస్తాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు. చెక్​డ్యాంల నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరాయని వివరించారు. వీటివల్ల భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 3.09 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.03 మీటర్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.

"చెక్​డ్యాంల వల్ల ఊళ్లలో పశువులకు వేసవిలో నీటి కరువు లేకుండా అయింది. ఈ చెక్​డ్యాంలలో మత్స్యకారులు చేపపిల్లలను కూడా పెంచుతున్నారు. వాతావరణంలో తేమ శాతం పెరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల తెలంగాణ ఆయిల్​పామ్​ తోటలకు అనువైన రాష్ట్రమని కేంద్రం నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టులు, చెక్​డ్యాంలు, రిజర్వాయర్​ల నిర్మాణం, చెరువుల్లో 365 రోజులు నీళ్లు ఉండటం వల్ల బయోడైవర్సిటీ కూడా పెరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు మరికొన్ని చెక్​డ్యాంలు నిర్మిస్తారా అని అడిగారు. ప్రస్తుతం ఉన్న చెక్​డ్యాంల నిర్మాణం పూర్తైన తర్వాత అవసరం ఉన్న చోట ఏర్పాటు చేస్తాం."

-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి : Telugu akademi scam 2021 : 'ఫిబ్రవరిలోనే ఎఫ్​డీలు కాజేసేందుకు యత్నం!'

Last Updated : Oct 4, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.