ETV Bharat / city

నిధుల వ్యయంలో జాప్యం... ఆర్థికశాఖ సీరియస్

తెలంగాణలో ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోవడంపై ఆర్థికశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రూపాల్లో నిధులు అందుబాటులో ఉంచుతున్నా... ఎందుకు ఖర్చు కావడం లేదన్న అంశంపై సమీక్షించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్‌ శాఖల్లోనే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు... వాటిపై ఆరా తీసే పనిలో పడ్డారు.

నిధుల వ్యయంలో జాప్యం... ఆర్థికశాఖ సీరియస్
author img

By

Published : Sep 12, 2019, 7:51 AM IST

నిధుల వ్యయంలో జాప్యం... ఆర్థికశాఖ సీరియస్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్న నిధులు వ్యయం కాకపోవడాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయా శాఖలు వ్యయం చేయని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికార గణం... కారణాలను తెలుసుకునే పనిలో పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక వ్యయం ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసినందున శాఖల వారీగా నిధుల వ్యయం తీరును పరిశీలిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేర లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్న కారణంగా నిధులు ఖర్చు చేయని శాఖలపై ప్రత్యేక దృష్టిసారించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1.46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి... 2018-19 ఆర్థిక సంవత్సరంలోని వ్యయం, ఈ ఏడాది రాబడుల అంచనాలు ప్రాతిపదికగా తీసుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1.30లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయాటాన్ని ఆర్థికశాఖ తీవ్రంగా పరిగణించింది. వివిధ శాఖలకు చెందిన గత కొన్నేళ్ల కేటాయింపులు, వ్యయాలు పరిశీలించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. విధానపరమైన నిర్ణయాల్లో ఆలస్యం, టెండర్ల ఖరారులో జాప్యం వల్లనే నిధులు మిగిలిపోతున్నాయని గుర్తించింది.

సాగునీరు, మిషన్‌ భగీరథ మినహా మిగిలిన ఇంజినీరింగ్‌ శాఖల్లో అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న నిధుల్లో ఆశించినంత వ్యయం ఉండటం లేదని ఆర్థికశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.72లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి... ఆ తరువాత అంచనాలను రూ.1.62లక్షల కోట్లకు సవరించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం రూ.1.30లక్షల కోట్లు మాత్రమే ఖర్చైనట్లు వెల్లడైంది. పురపాలక శాఖ, పంచాయతీరాజ్‌, వైద్యారోగ్యశాఖ, శాసనసభ్యులకు ఇస్తున్న నియోజకవర్గ అభివృద్ధి నిధుల వ్యయంలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఇదీ చూడండి: అనుచరుల ముందు జోగు రామన్న కంటతడి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.