ETV Bharat / city

Fund Raising :నిధుల సమీకరణపై ఆర్థికశాఖ మంత్రివర్గ ఉపసంఘం భేటీ - telangana finance minister harish rao

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ వల్ల తగ్గిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. నిధుల సమీకరణలో భాగంగా.. హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నిధుల సమీకరణపై ఇవాళ ఆర్థికశాఖ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.

fund raising, fund raising in telangana
తెలంగాణ ఆదాయం పెంపు, తెలంగాణలో ఆదాయం పెంపుపై దృష్టి, తెలంగాణలో నిధుల కోసం మథనం
author img

By

Published : Jun 17, 2021, 12:22 PM IST

కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. ఒక్క మే నెలలోనే 4వేల 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇటీవల కేంద్రానికి తెలిపింది. నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ భూముల వేలానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

రుణపరిమితిని 5 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర అవకాశాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తోపాటు అధికారులు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. గృహానిర్మాణ సంస్ధ పరిధిలోని భూములు, ఇండ్ల విక్రయం సహా ఇతర అంశాలపై ఉపసంఘం చర్చించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.