Boyapati On Ongole Bulls : ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొప్పూరావూరులో జరుగుతున్న ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలకు ఆయన హాజరయ్యారు. ఎడ్ల పందాలను ఉత్సాహంగా తిలకించారు.
ఒంగోలు జాతి ఎద్దులు తెలుగువారికే కాక.. భారత దేశానికి గర్వకారణమని బోయపాటి శ్రీను. ఎంతో ప్రత్యేకమైన, దృఢమైన ఈ జాతి పశువుల్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఒంగోలు జాతి ఎద్దుల గొప్పదనం అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. ఒక రైతు బిడ్డగా ఈ ఎద్దుల గురించి తెలుసు కాబట్టే అఖండ సినిమాలో చూపించానని తెలిపారు. తనకేం కావాలో రైతులకు ముందుగానే చెప్పానని.. అందుకే అత్యంత సహజంగా అఖండ సినిమాలో ఎద్దులు కనిపించాయని వివరించారు.
ఒంగోలు జాతి ఎద్దులు చాలా బలమైనవి. అవి సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో నాకు బాగా తెలుసు. కానీ ఇటీవల కాలంలో ఈ జాతి ఎద్దులను బండ్లు లాగడానికి మాత్రమే వినియోగిస్తున్నారు. అందుకే వాటి బలాన్ని ప్రజలకు తెలియజేయడానికే అఖండ సినిమాలో చూపించాను. -బోయపాటి శ్రీనివాస్, సినీ దర్శకుడు
ఇదీ చదవండి : మిర్చి పంటకు సోకిన తెగుళ్లు.. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య