ETV Bharat / city

Grain purchase issue: తెరాస వర్సెస్ భాజపా.. తెలంగాణలో మాటల యుద్ధమేంటి?

author img

By

Published : Nov 12, 2021, 10:08 AM IST

తెలంగాణ అంటే కేసీఆర్.. తెలంగాణ అంటే టీఆర్​ఎస్... అనేలా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు గులాబీ బాస్! ప్రత్యేక రాష్ట్ర సాధన నాటి నుంచి.. నేటి వరకూ తిరుగులేని నేతగా తన పేరును లిఖించేసుకున్నారు. ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం.. పదవి ఏదైనా గులాబీకే కైవసం.. అనిపించేలా తెలంగాణ ప్రజల మనసులో సుస్థిరమైపోయారు. కానీ ఒక ఎన్నిక పరిస్థితిని తారుమారు చేసింది! ఒకరి గెలుపు కేసీఆర్​ను అంతర్మథనంలోకి నెట్టేసింది. ఫలితంగా.. తెరాస వర్సెస్ భాజపా పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఇది.. అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరికి ధాన్యం కొనుగోళ్ల వైపునకు మళ్లింది. ప్రస్తుతం తెలంగాణలో గులాబీ, కమలాల మధ్య అగ్గి రాజుకుంది. 'ధాన్యం' కేంద్రం బిందువుగా మాటల యుద్ధం సాగుతోంది.

Grain purchase issue
fight between trs and bjp

వరి కొనుగోళ్లపై తెలంగాణలో తెరాస-భాజపా మధ్య పంచాయితీ నడుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. తామంటే తామే రైతులకు మేలు చేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. హుజూరాబాద్​ ఎన్నికల ముందు ఈటల కేంద్రంగా రాజకీయాలు చేసిన తెరాస, భాజపా. ఫలితాల అనంతరం వరి కొనుగోళ్ల వ్యవహారాన్ని భుజానికెత్తుకున్నాయి. ఫలితంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈటల బర్తరఫ్​ సమయంలో వేడెక్కిన తెలంగాణ రాజకీయం నేటి వరకు రోజుకో మలుపు తిరుగుతూ మరింతగా హీటెక్కుతోంది.

తెరాస వాదనిది..

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తోందని.. ఉత్తరాదిపై ప్రేమ కురిపిస్తూ.. దక్షిణాది రైతులను ముంచేస్తోందని తెరాస నేతలు ఆరోపించారు. కేంద్ర వరి కొనుగోలు చేయలేము.. వరి సాగు నుంచి రైతులను దృష్టిమళ్లించాలని కోరితేనే.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు స్పష్టమైన ప్రకటన చేసిందని.. తెరాస నేతలు, మంత్రులు చెబుతున్నారు.

ప్రతి గింజా కొంటామన్నారుగా.. అంటున్న భాజపా

రాష్ట్రంలో పండిన ప్రతిగింజా కొంటామని.. కేంద్రంలో పనేంటని గతంలో తెరాస ప్రభుత్వం, నేతలు అనేకసార్లు చెప్పారంటూ.. గులాబీ పార్టీ నేతలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానికి పైసా కూడా ఖర్చులేదని.. చివరికి గన్నీ సంచుల నగదు కూడా కేంద్రమే ఇస్తోందని.. తెరాస నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదని రాష్ట్ర భాజపా నేతలు చెబుతున్నారు. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసిందని.. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని భాజపా నేతలు చెబుతున్నారు. ఇలా కేంద్రానిదే తప్పని తెరాస నేతలు, రాష్ట్రానిదే బాధ్యతని భాజపా నేతలు ఎవరికీ వారు తెగేసి చెబుతున్నారు.

కేసీఆరే​ స్వయంగా రంగంలోకి..

ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా రంగంలోకి దిగారు. నవంబర్​ 7న సుమారు గంటన్నరపాటు మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వం, భాజపా నేతలపై వ్యాఖ్యలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరి కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం కొర్రీలు పెడుతోందంటూ.. నిప్పులు చెరిగారు. వరి కొనుగోళ్లు చేయలేమని... రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని లిఖితపూర్వకంగా కేంద్రం రాసిచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం సూచనతోనే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి యాసింగిలో వరి సాగుచేయొద్దని స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరించారు.

'ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోంది. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది.

- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి.

ఘాటుగా బదులిచ్చిన కిషన్​రెడ్డి..

ముఖ్యమంత్రి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమంటూ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఘాటుగానే బదులిచ్చారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. వరి సాగుచేయొద్దంటూ కేంద్రమెప్పుడు చెప్పలేదని.. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలపై కౌంటర్​ అటాక్​ చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్న కిషన్​రెడ్డి... సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను రైతులకు వివరిస్తామన్నారు.

ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నాం. పంజాబ్‌ నుంచి 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుంటుంటే.. తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తోంది. ధాన్యం సేకరణకు కేంద్రం రూ.26,640 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. 2014లో ఉన్న రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. 41 లక్షల మెట్రిక్ టన్నులకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడేమో 108 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలంటున్నారు.

- జి. కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి.

కేంద్రంపై ఎవరేమన్నారు..

'ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని.. అందువల్ల ఈ యాసంగిలో (Niranjan Reddy On Rice Crop) రైతులు వరి వేయవద్దని.. యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ప్రకటనపై భాజపా ఎంపీ సైతం ధర్మపురి అర్వింద్​ గట్టిగా సమాధానం ఇచ్చారు. తాను సంబంధిత కేంద్రమంత్రితో మాట్లాడానని.. వరి కొనుగోను చేయమనే ప్రకటన తామెప్పుడు చేయలేదని చెప్పారని.. అర్వింద్​ చెప్పారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

భాజపా, తెరాస.. ఒకటి కేంద్రంలో అధికారపార్టీ.. మరొకటి రాష్ట్రంలో అధికారపార్టీ! ధాన్యం కొనుగోళ్లలో తప్పు మీదంటే.. మీదని నిందలేసుకుంటున్న పార్టీలు. తెలంగాణలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే తాపత్రయం ఒకరిది. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఆశ మరొకరిది. వీరి ఆధిపత్య పోరులో అమాయకపు రైతన్న బలైపోతున్నాడా? అందరి కడుపులు నింపే అన్నదాత భవిష్యత్తు అంధకారమవుతోందా? ఇంతకీ.. ధాన్యం కొనుగోళ్ల తప్పెవరిది!?

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.