హైదరాబాద్ నాగోల్లో మద్యం టెండర్ల ప్రక్రియలో రసాభాస చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మద్యం పాలసీ టెండర్లలో ప్రాంతీయ విభేదాలు భగ్గుమన్నాయి. స్థానికేతరులు టెండర్లు వేయొద్దంటూ స్థానికులు వాగ్వాదానికి దిగడం వల్ల కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీనగర్ పోలీసులు రంగంలోకి దిగి గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి.. టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా ఎవరైనా టెండర్ వేసుకోవచ్చని స్పష్టం చేశారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం టెండర్లలో రసాభాస
హైదరాబాద్ నాగోల్లోని ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన మద్యం టెండర్ల ప్రక్రియలో ప్రాంతీయ విభేదాలు భగ్గుమన్నాయి. టెండర్లకు చివరి రోజు కావడం వల్ల తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.