Gurukul notification: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలయింది. నేటి నుంచి మార్చి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులుగా తెలిపారు.
ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
మే 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని 603 గురుకుల పాఠశాలల్లో 48 వేల 280 సీట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ తెలిపారు. అందులో 232 ఎస్సీ గురుకులాల్లో 18 వేల 560 సీట్లు, 77 ఎస్టీ గురుకులాల్లో 6 వేల 80 సీట్లు, 132 బీసీ గురుకులాల్లో 20 వేల 800 సీట్లు, 15 జనరల్ గురుకుల పాఠశాలల్లో 2 వేల 840 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల వెబ్ సైట్లలో పూర్తి వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్