ETV Bharat / city

మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ అతివ మనోభావాలు! - international women's day

స్త్రీ సంతోషానికి, దుఃఖానికి మగవారే కారణమా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ మనోభావాలేంటో తెలుసుకునేందుకు ఓ అతివతో కల్పిత ఇంటర్వ్యూ..

fictional interview with a woman on international women's day 2021
మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ అతివ మనోభావాలు!
author img

By

Published : Mar 8, 2021, 2:02 PM IST

  • మహిళా దినోత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి?

ప్రతి రోజు మా గురించి పట్టించుకోని మగ మహారాజులు ఈ ఒక్కరోజు మా సేవలను గుర్తించి సన్మానాలు చేస్తూ ఉంటారు.

  • అయితే మహిళా దినోత్సవం మీకు వద్దా?

కావాలి. కానీ ఈరోజు మహిళల మీద ఎంత గౌరవం చూపిస్తారో.. అలాంటి గౌరవం ప్రతి రోజూ ఇవ్వలేనప్పుడు ఎందుకని నా అభిప్రాయం.

  • మీకు వచ్చిన కష్టం ఏంటి?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మేం పుట్టడానికి, గిట్టడానికి మగవాడే కారణం అని అనిపిస్తుంది. ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావిస్తారు కొందరు. అసలు తప్పంతా మాదే అన్నట్టు నిష్టూరాలడతారు. పిల్లలు పుట్టడంలో మా ఒక్కరి ప్రమేయమే ఉండదన్న చిన్న విషయం వాళ్లకెందుకు అంతుపట్టదు. మాపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయి. ఎప్పుడేమవుతుందోనని గడపదాటిన క్షణం నుంచి భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • మీకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలున్నాయి కదా?

పోలీసులు పెరుగుతున్నారు. చట్టాలు పెరుగుతున్నాయి. అలాగే.. దుండగులు పెరుగుతున్నారు. మాపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి ఆడవాళ్లకు భద్రత కల్పించడంలోనే కాదు.. తప్పు చేసి తప్పించుకునే లొసుగుల్లోనూ వచ్చిందనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.

  • ఏంటమ్మా మీ మెడ బోసిగా ఉంది.. బంగారం లేదా?

మాకు అత్యంత ఇష్టమైనది బంగారం. ఎంతో కష్టపడి కట్టుకున్నవాడు మా కోసం బంగారం తీసుకొస్తాడు. అది ఎంతో ఇష్టంగా అలంకరించుకుంటే.. సులభంగా లాక్కెళ్లే వారే ఎక్కువయ్యారు. బంగారం వేసుకోవడానికి కూడా భయపడాల్సిన దుస్థితేంటండి.

  • మహిళల వస్త్రధారణ మీద మీ అభిప్రాయం?

అమ్మాయిలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి ఇష్టానికే వదిలేయాలి. ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్లే.. అబ్బాయిలు తప్పుగా చూస్తారు.. అనర్థాలు జరుగుతాయంటే.. తప్పు ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు అమ్మాయిలు వేసుకునే బట్టల వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే.. నెలల పసిగుడ్డు, నాలుగు, ఐదేళ్ల వయస్సులో ఉన్న చిన్నారులపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి. పరిధులు దాటని ఫ్యాషన్ ఏదైనా మంచిదే. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా ఆమె నిర్ణయం.

  • ఆడవారిలో మోసం చేసే వాళ్లు ఉన్నారా?

కొంతవరకు ఉన్నారు. ప్రేమిస్తున్నానని చెప్పి వాడుకుని వదిలేసే అబ్బాయిలు ఎలా ఉన్నారో... అమ్మాయిలూ ఉన్నారు. కానీ.. తల్లిదండ్రులకు భయపడి.. సమాజానికి తలొగ్గి ప్రేమించిన వాడిని దూరం చేసుకున్న సందర్భాలే ఎక్కువమటుకు ఉన్నాయనేది నా అభిప్రాయం. మగవాడి బలహీనతకు స్త్రీ తన అందాన్ని ఎరగా వేసి సర్వం దోచుకున్న సందర్భాలూ ఉన్నాయనుకోండి.

  • ఎల్లమ్మ, మల్లమ్మ, వెంకమ్మ, లక్ష్మమ్మ... ఇలా ఒకప్పుడు పేర్లు ఉండేవి కదా! అసలు అలా పేర్లు పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు?

ప్రతి పేరులో చివరకి 'అమ్మ' అనే పదం కలిసి ఉంది గమనించారా! ప్రతి అమ్మాయిలో అమ్మని గుర్తు చేసుకొమ్మని కావొచ్చు మన పూర్వికులు అలా పెట్టారేమో.

  • మహిళలు ఏం కోరుకుంటారు?

చిన్న చిన్న ఆనందాలకే మేం సంతోషపడుతుంటాం. కాసేపు మాతో గడపండి. మాకూ కొంత సమయం కేటాయించండి. మేం చేసే పనులను అప్పుడప్పుడు గుర్తించండి. ఇంటి విషయాల్లో మా అభిప్రాయాల్ని అడగండి. మాకేం కావాలో మీకే తెలుస్తుంది.

  • మగవారి మీద మీ అభిప్రాయం ఏంటి? (నవ్వుతూ)

మా కోసం అయితే షీ టీమ్స్, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.. పాపం మగవారికి అవి కూడా లేవు. గర్ల్ ఫ్రెండ్ కోపానికి, భార్యలకు బలైపోయే కొందరు అమాయకులు ఎలా బతుకుతారో...!

ఇదీ చూడండి : విమెన్స్​ డే స్పెషల్: ప్రతిరోజు ఆమెదే.. స్త్రీ విలువ తెలుసుకో.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.