ETV Bharat / city

థియేటర్లలో మేకులు, కంచెలు.. ఎందుకో తెలిస్తే షాక్..! - థియేటర్​లో ఇనుమ మేకులు, కంచెలు వార్తలు

RRR: సినీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా చూసినా.. ఆర్​ఆర్​ఆర్ మేనియా నడుస్తోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలను దాటుకొని ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఆన్​లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే హౌజ్ ఫుల్ అయిపోయాయి. చాలా థియేటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఏపీలో థియేటర్ యజమానులకు కొత్త కష్టాలు ఎదురయ్యాయి. అవేంటంటే..?

RRR
థియేటర్లలో వెలసిన మేకులు, కంచెలు
author img

By

Published : Mar 22, 2022, 10:54 PM IST

RRR: రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఒక్క హీరో సినిమాకే ఫ్యాన్స్​ హడావుడి మాములుగా ఉండదు. ఇద్దరు హీరోలు నటించిన సినిమా అయితే.. అందులోనూ మోగా, నందమూరి హీరోలైతే ఇక థియేటర్ దద్దరిల్లాల్సిందే. ఇప్పుడిదే థియేటర్ల యాజమానులను వేధిస్తున్న అసలు సమస్య.

గతంలో భీమ్లా నాయక్, రాధేశ్యాం చిత్రాల విడుదల సమయంలో అభిమానులు అత్యుత్సాహంతో తెరపైకి పూలు, పాలు విసిరారు. కొన్ని చోట్ల తెరలను చించేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా.. ఏపీలో థియేటర్ యాజమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెండితెర వద్దకు వచ్చి నృత్యాలు చేయడం, కాగితాలు విసరడం వంటి సందడితో ఇతర ప్రేక్షకులకు అసౌకర్యం కలుగుతోందని భావిస్తోన్న ధియేటర్‌ నిర్వాహకులు తెర చెంతకు ఎవరూ రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకాకుళంలోని సూర్య మహల్ థియేటర్ యాజమాన్యం తెర వద్దకు ఎవరూ వెళ్లకుండా.. కంచె(ఫెన్సింగ్)ను ఏర్పాటు చేశారు. అభిమానుల తాకిడి తట్టుకునేందుకు.. తెర వద్దకు వచ్చి హడావుడి చేయకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు థియేటర్ మేనేజర్ ధనంబాబు తెలిపారు.

విజయవాడలోని అన్నపూర్ణ ధియేటర్‌ వద్ద స్క్రీన్‌ వద్ద అభిమానులు హడావుడి చేయకుండా ఉండేందుకు ఫ్లైవుడ్ బోర్డుపై మేకులు అమర్చి స్క్రీన్ దగ్గర ఉంచారు. అలాగే మరికొన్ని థియేటర్లలో స్క్రీన్ చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లైవుడ్‌పై మేకులున్న బోర్డుల ఫొటోలను అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం ట్విట్టర్​లో ఉంచడంతో అవి వైరలయ్యాయి. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు ఎవరూ హద్దులు మీరకుండా సినిమాను ఆనందించి వెళ్లండని థియేటర్‌ నిర్వాహకులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.