ETV Bharat / city

మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'! - షీ సేప్ యాప్ ప్రత్యేకతలు

మహిళల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు కొత్త యాప్​కు శ్రీకారం చుట్టారు. 'షీ సేఫ్' అనే పేరుతో రూపొందించిన అప్లికేషన్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలకు పలు విషయాల పట్ల అవగాహన కల్పించడంమే కాక.. ఆపద సమయంలోనూ బాధితులను ఆదుకునే విధంగా యాప్ పనిచేయనుంది.

features and advantages of she safe app
కొత్త అస్త్రాన్ని ఆవిష్కరించిన సైబరాబాద్ పోలీసులు
author img

By

Published : Feb 21, 2020, 7:51 PM IST

కొత్త అస్త్రాన్ని ఆవిష్కరించిన సైబరాబాద్ పోలీసులు

కరీంనగర్​లో బీటెక్ పూర్తి చేసిన ఓ యువతి ప్రాంగణ ఎంపికలో సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రారంభ వేతనమే రూ.25వేలు. పని చేయాల్సిన ప్రాంతం గచ్చిబౌలిలోని ప్రముఖ కంపెనీ. తల్లిదండ్రులను వదిలి హైదరాబాద్​లో తెలియని చోట ఉంటోంది. సమాజంలో అక్కడక్కడా మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కొత్త ప్రదేశంలో ఉద్యోగం కత్తిమీద సామే. ఇలాంటి యువతులకు, ఐటీ కారిడార్​కు వచ్చే మహిళలకు అండగా ఉంటున్నారు సైబరాబాద్ పోలీసులు.

డౌన్​లోడ్ చేసుకుంటే చాలు..

ఇప్పటికే షీ టీం బృందాలు, బాలమిత్ర, షీ షటిల్, మార్గదర్శక్ వంటి కార్యక్రమాలతో ఐటీ ఉద్యోగులకు రక్షణగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు... మరో కొత్త అస్త్రాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. మహిళా భద్రత కోసం 'షీ సేఫ్' యాప్​ను రూపొందించారు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో తీర్చిదిద్దిన ఈ అప్లికేషన్​ను సైబరాబాద్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలు, యువతులు.. తమ స్మార్ట్ ఫోన్స్​లో 'షీ సేఫ్' అప్లికేషన్​ను డౌన్​లోడ్ చేసుకుంటే చాలు అందులో ఉండే సౌకర్యాలను పొందొచ్చు.

దినచర్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే..

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వాళ్లు.. ప్లేస్టోర్ లోకి వెళ్లి 'షీ సేఫ్' యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అనంతరం వినియోగదారుని ఫోన్ నెంబర్, పేరుతో నమోదు చేసుకొని వినియోగించుకోవచ్చు. మహిళలు తమ దినచర్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్​లో పొందుపర్చారు. ఎస్సీఎస్సీకు చెందిన మార్గదర్శక్​ల చిరునామాను యాప్​లో ఉంచారు. దీనివల్ల వినియోగదారులెవరైనా అవసరాన్ని బట్టి సంబంధిత మార్గదర్శక్​ను సంప్రదించవచ్చు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు... మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీం బృందాల ఫోన్ నెంబర్లు, భరోసా కేంద్రం, సఖి సెంటర్, మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్​తోపాటు... భూమిక స్వచ్ఛంద సంస్థ టోల్ ఫ్రీ నెంబర్​ను యాప్​లో అందుబాటులో ఉంచారు.

మహిళల హక్కులు, చట్టాల గురించి..

ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలను నమోదు చేస్తారు. దీనివల్ల ఆహుతులెవరైనా పాల్గొనవచ్చు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపర్చారు. మహిళల హక్కులు, చట్టాల గురించి యాప్​లో వివరాలున్నాయి. బాధిత మహిళలు ఏ సమయంలో, ఎవరిని ఎలా సంప్రదించాలనే అంశాలు అందుబాటులో ఉన్నాయి.

పది నిమిషాల్లోనే 100 పైగా డౌన్ లోడ్స్..

సమస్త వివరాలతో కూడిన 'షీ సేఫ్' యాప్​కు స్పందన కూడా బాగానే లభిస్తోంది. ప్రారంభించిన మొదటి పది నిమిషాల్లోనే 100మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి.. ఐటీ కారిడార్​లోని మహిళలందరికీ ఉపయోగపడేలా సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు 'షీ సేఫ్' యాప్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ రూపొందించిన 'హాక్-ఐ' యాప్ లాగే 'షీ సేఫ్' పనిచేయనుంది. మరిన్ని సౌకర్యాలను షీసేఫ్ యాప్ లో పొందుపర్చడం వల్ల మహిళలకు మరింత ఉపయోగపడనుంది.

ఇవీ చూడండి: దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.