ETV Bharat / city

భార్య డబ్బులు ఇవ్వలేదని 6నెలల బిడ్డను చంపేశాడు..

మానవ సంబంధాలు కనుమరుగైపోతాయేమో అనేందుకు ఉదాహరణే ఈ సంఘటన. వ్యసనాలకు అలవాటు పడిన మనిషి ఏ విధంగా క్రూరంగా మారుతారో అని చెప్పేందుకు సరిగ్గా సరిపోయే ఘటన. చెడుసావాసాలకు అలవాటు పడి... భార్యను డబ్బు అడిగితే లేవని చెప్పినందుకు ఆరు నెలల కన్నకూతురి గొంతు నులిమేశాడు ఓ తండ్రి.

father killed daughter for money in amanigoodupadu at prakasham district
6 నెలల పసి కందును గొంతు నులిపి చంపిన తండ్రి
author img

By

Published : Jun 19, 2020, 5:56 PM IST

డబ్బులు ఇవ్వలేదని భార్యపై కోపంతో.. 6 నెలల పసి కందును గొంతు నులిపి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా యర్రగొండపలెం మండలం అమనిగూడిపాడులో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన బాల ఏసు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బులివ్వమని భార్యను అడగగా.. తన దగ్గర లేవని చెప్పడంతో కోపంతో పక్కనే ఉన్న ఆరు నెలల కూతురి గొంతు నులిమేశాడు. అడ్డుకునేందుకు భార్య ప్రయతించినప్పటికీ పసికందు ప్రాణాలు దక్కలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :షార్ట్‌ సర్క్యూట్‌తో టీవీ పేలి ఇల్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.