ETV Bharat / city

30 ఏళ్ల మహిళ వలలో చిక్కుకున్న 19 ఏళ్ల కొడుకు కోసం ఓ తండ్రి ఆరాటం - మానవ హక్కుల కమిషన్​

Father Complaint to HRC ముప్పై ఏళ్ల మహిళ వలలో చిక్కుకున్న తన 19 ఏళ్ల కొడుకు కోసం ఓ తండ్రి మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా మేజర్​ అయిన కారణంగా తన కుమారున్ని ఆ మహిళతోనే పంపించారని ఆ అబ్బాయి తల్లిదండ్రులు వాపోయారు. తన కుమారున్ని ఎలాగైనా తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కన్నీరుమున్నీరయ్యారు.

father complaint to HRC on 30 years women for trapping his 19 years son in gachibowli

author img

By

Published : Aug 12, 2022, 6:58 PM IST

Father Complaint to HRC: ఓ మహిళా వలలో చిక్కుకున్న తన కన్న కొడుకును రక్షించుకునేందుకు... ఓ తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలికి చెందిన బాబురావు ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. బాబురావుకు ఇద్దరు కుమారులున్నారు. అయితే.. రెండో కుమారుడు అలెక్స్ (19)ను అదే ప్రాంతంలో ఉంటున్న 30 ఏళ్ల మహిళ ట్రాప్ చేసిందని... బాబురావు ఆమె భార్యతో కలిసి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.

బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అలెక్స్​ను.. ప్రేమ, పెళ్లి పేరుతో సదరు మహిళ తన వలలో వేసుకుందని బాబురావు ఆరోపించారు. తన కొడుకును తమ వద్దకు రాకుండా చూస్తోందని వాపోయారు. జూన్ 26న ఇంట్లో నుండి వెళ్లిన అలెక్స్... ఇంత వరకు తమ ఇంటికి రాలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మేజర్ అన్న కారణంతో పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారున్ని తమకు ఇప్పించాలని అలెక్స్​ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ.. హెచ్చార్సీని వేడుకున్నారు.

"గచ్చిబౌలి సుదర్శన్​ కాలనీలోని ఓ దుకాణంలో పని చేసే 30 ఏళ్ల మహిళ.. బీటెక్​ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల నా కుమారున్ని ట్రాప్​ చేసింది. ప్రేమ, పెళ్లి పేరుతో వలలో వేసుకుని తీసుకెళ్లింది. ఇందుకోసం ఆ మహిళ బంధువులు కొంతమంది సపోర్ట్​ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మేజర్​ అన్న ఒకే ఒక కారణంతో వాంగ్మూలం తీసుకుని మళ్లీ ఆమెతోనే పంపించారు. ఇప్పుడు నా కుమారుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి పేర్లతో నా కుమారుని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎలాగైనా నా కుమారున్ని మాకు అప్పగించేలా చర్యలు తీసుకొండి." - బాబురావు, యువకుడి తండ్రి

30 ఏళ్ల మహిళ వలలో చిక్కుకున్న 19 ఏళ్ల కొడుకు కోసం ఓ తండ్రి ఆరాటం

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.