ETV Bharat / city

సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం - ధరణిపై కేసీఆర్ సమీక్ష

kcr
kcr
author img

By

Published : Dec 31, 2020, 3:20 PM IST

Updated : Dec 31, 2020, 4:46 PM IST

15:18 December 31

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో రైతులకు ఇబ్బందులు ఉండకూడదు: సీఎం

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు తొలగించేందుకే ధరణి పోర్టల్‌ తెచ్చామన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయన్నారు. ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్‌లో మెరుగు పర్చాల్సిన అంశాలపై చర్చించారు.

రెండు నెలల్లో పరిష్కారం

రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి పోర్టల్‌ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నారు. వాళ్లలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది 5 ఎకరాల లోపు వారే. అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారు.  

- కేసీఆర్​

వారికి యాజమాన్య హక్కులు ఖరారు చేయాలి

ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్న వారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలని సీఎం సూచించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించి స్లాట్లు కేటాయించాలన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

జిల్లాకో ట్రైబ్యునల్​

కోర్టుల విచారణలో ఉన్నవి మినహా పార్ట్-బీ లో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ 60 రోజుల్లో కలెక్టర్లు పరిష్కరించాలి. అవసరమైతే కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి యాజమాన్య హక్కులు ఖరారు చేయాలి. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాల పరిష్కారానికి జిల్లాకో  ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. సరిహద్దు వివాదాలను సర్వే నిర్వహించి కలెక్టర్లు హద్దులు ఖరారు చేయాలి.

- కేసీఆర్​  

వాటిపై విచారణ జరపాలి  

1/70 చట్టం అమల్లో లేని  ప్రాంతాల్లో కేసులను పరిష్కరించాలని.. మిగతా చోట్ల ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్నారు. ఒకే సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టారని... వాటిపై కలెక్టర్లు విచారణ జరిపి హక్కులు నిర్ణయించి.. ధరణిలో వివరాలు చేర్చి పాస్ పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటుతో పాటు నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు.  

స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు ఇవ్వాలి

అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏకు సైతం ధరణి పోర్టల్ ద్వారా అవకాశం కల్పించాలి. పాస్ పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్నారైలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసుకునే అవకాశం ఇవ్వాలి. అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాలేకపోయే వారికి మరో రోజు అవకాశం ఇవ్వాలి. స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి.  

- కేసీఆర్​

ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తుదారుడికి తెలిపే ఆప్షన్  ఉండాలని సీఎం సూచించారు. మైనర్ల పేరుతో భూములు రిజిస్ట్రేషన్ చేస్తే.. మైనర్లతోపాటు సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని కేసీఆర్​ ఆదేశించారు.  

ఇదీ చదవండి : జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్

Last Updated : Dec 31, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.