ETV Bharat / city

కర్షకుడే కాడెత్తితే... పుడమి తల్లి పండదా!

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతంలో సాగు ఆలస్యంగా మొదలైంది. ఈ మధ్య కురిసిన చిరుజల్లులతో ఖరీఫ్ సాగు ప్రారంభించిన రైతన్నలు.. పొలం దున్నే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిరాయికి ఎద్దులు తెచ్చుకోలేక అన్నదాతలే కాడెద్దులై దుక్కి దున్నుతున్నారు.

కర్షకుడే కాడెత్తితే... పుడమి తల్లి పండదా!
author img

By

Published : Aug 13, 2019, 8:20 PM IST

కర్షకుడే కాడెత్తితే... పుడమి తల్లి పండదా!

కృష్ణా నది వరదతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే... కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పడిన కొద్దిపాటి చినుకులకు ఖరీప్ సాగు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ చినుకు జాడ లేక.. సాగు సాధ్యం కాక.. కరవునుంచి బయటపడలేక... కాడెద్దులను అమ్ముకుని రోజులు వెళ్లదీసుకున్న రైతన్నలు.. ఇప్పుడు ఖరీఫ్​లో దుక్కి దున్నేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తమకే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పశువులను మేపలేక అమ్ముకున్నామని ఆవేదనతో చెప్పారు. ఈ మధ్య పడిన కొద్ది పాటి వర్షాలతో పొలం బాట పట్టిన కర్షకులకు కాడెద్దుల సమస్య వచ్చింది. కిరాయికి ఎద్దులు కావాలంటే రోజుకు రూ.500 చెల్లించాలి. ఈ భారం భరించలేక భుజాలనే నమ్ముకున్నారు. నాగలి పట్టారు. పుడమి తల్లిని పండించడానికి కర్షకులే కాడెద్దులుగా మారారు. చెమట చిందిస్తూ సాగు సాగిస్తున్నారు.

ఇవీ చూడండి: సింహం సింగిల్​గా రోడ్డెక్కి దాహం తీర్చుకుంది!

Intro:AP_RJY_64_13_WATER_WASTAGE_DAILY_AV_AP10022

Body:త్రాగునీరు వృధాగా పోతున్న అధికారులు స్పందించటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ( మండలం) యానాదుల పేటలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి నీరు భారీ మొత్తంలో వృధాగా పోతుంది...గ్రామానికి 1.2 లక్షల త్రాగునీరు అందించే ఈ వాటర్ ట్యాంక్ శిలావస్థకు చేరుకొంది... పిల్లర్లు పెచ్చులూడిపోతున్నాయి...నీరు ఉదయం నుండి సాయంత్రం వరకు వృధాగా పోతుంది ...ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక మహిళలు ట్యాంక్ వద్ద ఆందోళన నిర్వహించారు... శ్రీనివాస్ ....ప్రత్తిపాడు ...617...AP 10022

Conclusion:AP_RJY_64_13_WATER_WASTAGE_DAILY_AV_AP10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.