భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెరాస నేత, జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ మరణంపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రణబ్ నిజమైన రాజనీతిజ్ఞుడు అన్నారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేశారని పేర్కొన్నారు. దేశ అత్యున్నత పదవిని అలంకరించినా ఏనాడు గర్వం చూపని మహానేత అని గుర్తుచేశారు. తెలంగాణ సమాజం అయన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: రాజనీతిలో సరిలేరు మీకెవ్వరూ..