రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ మంత్రి గీతారెడ్డి కలిశారు. యునాని, ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు. యునాని, ఆయుర్వేద, సిద్ధ వంటి ప్రాచీన వైద్య విధానాలను అధునాతన వైద్య విధానం అలోపతితో కలపడం సరైంది కాదని గీతారెడ్డి పేర్కొన్నారు.
బూర్గుల రామకృష్ణారావు భవన్లో మంత్రి ఈటలను కలిసి వినతిపత్రం సమర్పించిన గీతారెడ్డి.. ఈ నోటిఫికేషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఈటలను గీతారెడ్డి కోరారు.
- ఇదీ చూడండి : ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బందుల్లో విజయ్ మాల్యా!