ఆహార భద్రత చట్టాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. 57 ఏళ్లు నిండిన రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనాతో లక్షలాది మంది అవస్థలు పడుతున్నా.. అత్యవసర ఆదేశాల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, బడా వ్యాపారుల ప్రయోజనాలకోసం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళలకు పిలుపునిచ్చింది.
వ్యవసాయం, విద్యుత్తు రంగాలను ప్రైవేటీకరించడానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. అఖిల భారత కిసాన్ సభ, భారతీయ ఖేత్ మజ్జూర్ యూనియన్ సంయుక్తంగా దేశవ్యాప్త ఆందోళలకు పిలుపునిచ్చాయని రాష్ట్ర రైతు సంఘం నేత వైవీ కృష్ణారావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 20 తేదీవరకు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 10 నుంచి 14 తేదీ వరకు జిల్లా పాలనాధికారుల ద్వారా రాష్ట్రపతికి మెమొరాండం పంపనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు 24 గంటల నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ వెల్లడించారు.
ఇవీచూడండి: హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం