Gorati meet CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి గోరటి వెంకన్న మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సీజేఐని కలిశారు. వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరటిని సీజేఐ అభినందించారు. శాలువాతో సత్కరించారు. సీజేఐకి వల్లంకి తాళం కవితా సంపుటిని గొరటి వెంకన్న బహుకరించారు. సీజేఐ అభ్యర్థన మేరకు అడవి తల్లిపై పాట పాడి వినిపించారు.
ఇవాళ సాయంత్రం దిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు.
ఇదీ చూడండి: