ETV Bharat / city

కొవిడ్ శవాలతో చిల్లర బేరాలు.. తల్లడిల్లుతున్న మృతుల కుటుంబాలు - cremation of corona dead bodies is difficult

కొవిడ్‌ మరణ మృదంగం నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అంత్యక్రియలపై ఓ స్పష్టత లేదు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన సమాచారం లేదు. ప్రైవేటు అంబులెన్సుల నుంచి శ్మశానాల నిర్వాహకుల దాకా అంతా శవాలతో చిల్లర బేరాలాడుతున్నా.. మోయలేని భారంతో బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నా అధికారుల్లో చలనం లేదు. కట్టడి చేసేవారూ, చర్యలు తీసుకునేవారూ లేకపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారు.

funeral, covid dead bodies funeral
కరోనా మృతులకు అంత్యక్రియలు, కరోనా మృతులు, తెలంగాణలో కరోనా మరణాలు
author img

By

Published : May 21, 2021, 9:59 AM IST

  • "సూరారం కాలనీకి చెందిన ఓ వ్యక్తి(70) గతనెల 26న కొవిడ్‌ బారిన పడి గచ్చిబౌలి టిమ్స్‌లో చికిత్స పొందారు. వారం క్రితం నెగెటివ్‌ వచ్చినా శ్వాస సంబంధిత సమస్యలుండటంతో అక్కడే ఉంచుకున్నారు. పరిస్థితి కుదుటపడి డిశ్ఛార్జి చేసే ఒక్కరోజు ముందే అకస్మాత్తుగా మృతిచెందారు. అంత్యక్రియల కోసం సూరారం కాలనీలోని శ్మశానానికి తీసుకెళ్తే రూ.30వేలు డిమాండ్‌ చేశారు. ఇదే శ్మశానవాటికలో సాధారణ మృతుల అంత్యక్రియలకూ రూ.20వేల నుంచి రూ.25వేల దాకా వసూలు చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.’’
  • ‘‘రెండురోజుల క్రితం సైబరాబాద్‌ కమిషనరేట్‌, ఫీడ్‌ ది నీడి బృందాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఓ బాధితుడు ఫోన్‌ చేశారు. ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రిలో మా బంధువు చనిపోయారు.. అంత్యక్రియలు చేయాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో జీహెచ్‌ఎంసీ సిబ్బందే చేస్తారు.. అక్కడ సంప్రదించండని కంట్రోల్‌ రూమ్‌ ప్రతినిధి తెలపగా.. ఇక్కడ రూ.70వేలు డిమాండ్‌ చేస్తున్నారని.. అంత భరించలేకే మీకు చేశామని సదరు బాధితుడు చెప్పడం గమనార్హం.

కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరపడానికి వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు తమ వారిని కోల్పోయామన్న బాధ.. మరోవైపు అప్పు చేసి చికిత్స చేపించామన్న ఆర్థిక భారంతో సతమతమవుతుంటే.. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి అంబులెన్సుల నుంచి శ్మశానాల నిర్వాహకుల వరకు అంతా పీక్కుతింటున్నారు. మొదట రూ.80వేలతో మొదలై రూ.30వేల దాకా దిగుతున్నారు. గాంధీ, టిమ్స్‌, ఛాతీ ఆసుపత్రుల వద్ద ఈ దందా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలపై, దహనానికి అయ్యే ధరల్ని నిర్ధారిస్తూ జీహెచ్‌ఎంసీ ఇప్పటికీ ఓ ప్రకటన ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.25వేలు.. వసూలు చేయమన్నారు..

ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ అధికారులే రూ.25వేలు వసూలు చేసుకోమని చెప్పారని ఓ అంబులెన్సు డ్రైవర్‌ బాధిత కుటుంబసభ్యులతో చెప్పిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలి.. మేం అంబులెన్సు మాట్లాడుకున్నామని బాధితుడొకరు ఫోన్‌ చేస్తే.. అలా కుదరదు అంబులెన్సు, అంత్యక్రియలు అన్నీ మేమే చేస్తాం రూ.25వేలు ఖర్చవుద్దని ఆ డ్రైవర్‌ చెప్పాడు. ఎల్బీనగర్‌ ఏఎంహెచ్‌ఓ మమ్మల్ని నియమించారని.. ఇదే అధికారిక ధరని చెప్పడం గమనార్హం. దీనిపై జోనల్‌ కమిషనర్‌తో పాటు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

ప్రజలకు సమాచారం ఇవ్వండి..

మృతులకు నగరంలో ఏ శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతోందనే విషయంపై సరైన సమాచారం లేదు. ఎంత వరకూ తీసుకోవాలనే దానిపై స్పష్టత ఇవ్వట్లేదు. నిర్ధారిత రుసుము లేకపోవడంతో కట్టెలు, డీజిల్‌, ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో బాధితుని నుంచి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొవిడ్‌, కొవిడేతర మృతుల అంత్యక్రియలకు స్థలం, ధరలతో అధికారిక సమాచారం విడుదల చేయాలి.

- శ్రీనివాస్‌ బెల్లం, సామాజిక కార్యకర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.