‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(AP CM JAGAN) బెయిల్ ఈ నెల 14న రద్దవుతుంది’ అంటూ కల్పిత కథనాన్ని(FAKE POSTS) సామాజిక మాధ్యమాల్లో(SOCIAL MEDIA) ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు(YCP LEADERS) వాపోయారు. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు మనోహర్ తదితరులు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు.
‘ముఖ్యమంత్రి బెయిల్ రద్దయ్యే రోజున తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులను కూడా నమ్మవద్దు. 1988 డిసెంబరు, 1991 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనల దృష్ట్యా నీలి గూండాలను మరోసారి ఎదుర్కొనక తప్పదు, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుంది’ ఒక కల్పిత కథనాన్ని రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏపీ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, మరోవైపు ఉద్దేశపూర్వకంగా జగన్ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా ఉన్న ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Krishna Water: తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం పిటిషన్